
AP CM YS Jagan : గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను సీఎం వైఎస్ జగన్ దంపతులు పరామర్శించారు. బుధవారం సాయంత్రం రాజ్ భవన్‌కు వెళ్లిన సీఎం జగన్ దంపతులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్ భవన్‌కు చేరుకున్న సీఎం జగన్‌కి గవర్నర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు. గత కొన్నిరోజుల క్రితం గవర్నర్ దంపతులకు కోవిడ్ బారిన విషయం తెలిసిందే. దీంతో వారు హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. చికిత్స అనంతరం విజయవాడకు చేరకున్నారు.
Read Also: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. పురిటిలోనే నవజాత శిశువు మరణం
ఈ నేపథ్యంలో సీఎం జగన్ దంపతులు.. గవర్నర్ దంపతులను కలిసి.. వారి ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని గవర్నర్ కు ముఖ్యమంత్రి సూచించగా…..రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామని గవర్నర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యుడు తలశిల రఘురామ్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, విజయవాడ నగర పోలీస్ కమషనర్ కాంతి రాణా టాటా, ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రమణ్యం, రాజ్ భవన్ ఉప కార్యదర్శి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.