కరోనా మరణాలను తగ్గించేందుకు... జగన్ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం

By Arun Kumar PFirst Published Jul 24, 2020, 10:16 PM IST
Highlights

కోవిడ్‌ కారణంగా మరణాల రేటు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టిందని ఏపి వైద్యారోగ్య శాఖ తెలిపింది. 

అమరావతి: కోవిడ్‌ కారణంగా మరణాల రేటు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టిందని ఏపి వైద్యారోగ్య శాఖ తెలిపింది. వైరస్‌ కారణంగా విషమ పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి ఉపయోగించే రెమ్‌డెసివిర్, టోసీలిజుమబ్‌ లాంటి యాంటీవైరల్‌ డ్రగ్గులను పెద్ద మొత్తంలో ఆస్పత్రులకు అందుబాటులో ఉంచుతోంది. రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ రెమ్‌డెసివర్‌ డ్రగ్స్‌ను ప్రభుత్వానికి అందిస్తోంది. కంపెనీ నుంచి రేపు సాయంత్రానికి 15వేలకుపైగా  డోసులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలోని ఆస్పత్రులకు చేరుకుంటున్నాయి. ఇంతకు ముందే మరో 5వేల డోసులను చేర్చారు. 

ఆగస్టు మూడోవారం నాటికి దాదాపు 70వేలకుపైగా డోసులు అందుబాటులోకి వస్తున్నాయి. అంటే దాదాపు 90వేలకుపైగా రెమ్‌డెసివర్‌ డోసులను ప్రభుత్వం సిద్ధంచేసింది. విషమ పరిస్థితుల్లో ఉన్న 15వేల మందికి ఈ మందులు సరిపోతాయని వైద్య ఆరోగ్యశాఖ చెప్తుంది. ఇంత పెద్దమొత్తంలో ఏ రాష్ట్రానికీ ఇంజక్షన్లు లేవని అధికారులు చెప్పారు. 

గణాంకాల ప్రకారం చూస్తే  క్రిటికల్‌ కేర్‌ చికిత్స అవసరమైన రోగుల సంఖ్య పాజిటివ్‌ కేసుల్లో 7 నుంచి 8 శాతం వరకూ ఉంటోంది. అంటే దాదాపు 2లక్షల పాజిటివ్‌ కేసుల వరకూ ప్రభుత్వం తెప్పించుకుంటున్న ఇంజెక్షన్లు సరిపోతాయి. అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, భయం వద్దని సీఎం జగన్ ఇవ్వాళ్టి సమీక్షా సమావేశంలో స్పష్టంచేశారు. 

read more  ఏపీలో కరోనా విజృంభణ: 80 వేలు దాటిన కేసులు, వేయికి చేరువలో మరణాలు

పరిస్థితిని బట్టి ఒక్కో రోగికి  5 నుంచి 7 డోసులు వరకూ రెమ్‌డెసివర్‌ను వినియోగించాల్సి వస్తుంది. ఇలా ఒకొక్కరిపైనా దాదాపు రూ.35వేల రూపాయల వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఖర్చు ఎంతైనా సరే... ఈ అత్యవసర డ్రగ్స్‌ను అందుబాటులో ఉంచాలని సీఎం ఇదివరకే ఆదేశాలు జారీచేశారు. 

రాష్ట్రంలో ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్‌ రెమ్‌డెసివర్‌ను ఉత్పత్తిచేస్తోంది. ఇక్కడి అవసరాలకు అనుగుణంగా ఈ మందును అందించాలని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చింది.


 

click me!