అమ్మఒడిపై క్లారిటీ: ప్రైవేట్ స్కూలైనా, ప్రభుత్వ స్కూలైనా రూ.15 వేలు

Siva Kodati |  
Published : Jun 23, 2019, 03:01 PM IST
అమ్మఒడిపై క్లారిటీ: ప్రైవేట్ స్కూలైనా, ప్రభుత్వ స్కూలైనా రూ.15 వేలు

సారాంశం

వైఎస్ జగన్ ఎన్నికల హామీలలో ప్రధానమైన నవరత్నాల పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.

వైఎస్ జగన్ ఎన్నికల హామీలలో ప్రధానమైన నవరత్నాల పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులకు మాత్రమేనన్న ప్రచారాన్ని ప్రభుత్వం కొట్టేసింది.

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రెండింట్లో చదువుతున్న విద్యార్ధులకు అమ్మఒడి పథకం వర్తిస్తుందని.... లబ్ధిదారుల ఎంపికకు పేదరికమే కొలమానమని ముఖ్యమంత్రి కార్యాలయం స్ఫష్టం చేసింది.

ఈ మేరకు ఆదివారం ఏపీ సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం కింద.. పిల్లలను పాఠశాలకు పంపే ప్రతి తల్లికి ప్రభుత్వం ఏడాదికి రూ. 15 వేలు అందజేస్తుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?