తవ్వి తీస్తాం: దేవినేనిపై విజయసాయిరెడ్డి సంచలనం

Published : Jun 23, 2019, 12:08 PM IST
తవ్వి తీస్తాం: దేవినేనిపై విజయసాయిరెడ్డి సంచలనం

సారాంశం

పోలవరం పనుల అంచనాలను ఎలా తగ్గిస్తారో చెప్పాలని  మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుబట్టారు.  

అమరావతి:  పోలవరం పనుల అంచనాలను ఎలా తగ్గిస్తారో చెప్పాలని  మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుబట్టారు.

 

 

మాజీ మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యలు వింటుంటే దొంగే తనను పట్టుకోవాలని పోలీసులకు సవాల్ విసిరినట్టుందని తన ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పోలవరం పనుల అంచనాలను ఎలా తగ్గిస్తారో చెప్పాలని మాజీ మంత్రి ఉమ అనడం దమ్ముంటే తనను పట్టుకొమని దొంగ పోలీసులకు  సవాల్ విసరినట్టుగా ఉందని ఆయన ఆరోపించారు.

 

అన్ని అనుమతులు ఉండి పనులు మొదలైన ప్రాజెక్టును టీడీపీ సర్కార్ ఏటీఎంలాగా వాడుకొన్నారని  ఆయన  విమర్శించారు. మీ దోపీడీలన్నీ బయటకొస్తాయని... ఎవరూ కూడ తప్పించుకోలేరని ఉమ చెప్పారు.

 

సీఎం జగన్  ఆదేశాల మేరకు ఓబీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టాం. దేశంలోని ఓబీసిలంతా సామాజికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని జగన్‌  ఆకాంక్షగా ఆయన ట్వీట్ చేశారు. దీనిపై చర్చ తప్పనిసరిగా అభ్యున్నత్తికి దారులు వేస్తోందని ఆయన చెప్పారు.

ప్రజా వేదికను ప్రభుత్వ నిధులతో నిర్మించింది...  దీన్ని చంద్రబాబు పార్టీ కార్యక్రమాలకు వాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఓడిపోయినా కూడ చంద్రబాబు తన ఆక్రమణలోనే పెట్టుకొన్నారని ఆయన ఆరోపించారు.  

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు ప్రజా వేదికను సిద్దం చేస్తోంటే చంద్రబాబు లేనప్పుడు తాళాలు తీస్తారా అంటూ ఆ పార్టీ నేతలు సానుభూతి డ్రామాలు ఆడడం పరువు తీసుకోవడమేనని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?