టీటీడీ బోర్డులో ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులు: ఉత్తర్వులు జారీ

By Siva Kodati  |  First Published Sep 19, 2019, 7:57 PM IST

తిరుమల తిరుపతి దేవస్ధానం బోర్డులో ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా  నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, రాకేశ్ సిన్హా (ఢిల్లీ), ఎ.జె. శేఖర్ (చెన్నై), కుపేందర్ రెడ్డి (బెంగళూరు), గోవింద హరి (హైదరాబాద్), దుష్మంత్ కుమార్ దాస్ (భువనేశ్వర్), అమోల్ కాలే (ముంబై) ఉన్నారు.


తిరుమల తిరుపతి దేవస్ధానం బోర్డులో ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా  నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

వీరిలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, రాకేశ్ సిన్హా (ఢిల్లీ), ఎ.జె. శేఖర్ (చెన్నై), కుపేందర్ రెడ్డి (బెంగళూరు), గోవింద హరి (హైదరాబాద్), దుష్మంత్ కుమార్ దాస్ (భువనేశ్వర్), అమోల్ కాలే (ముంబై) ఉన్నారు.

Latest Videos

undefined

వీరికి టీటీడీ పాలకమండలి సభ్యులతో సమానంగా ప్రోటోకాల్‌ ఉంటుందని, పాలకమండలి తీర్మానాలు ఆమోదించే సమయంలో ప్రత్యేక ఆహ్వానితులకు ఓటు హక్కు ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కాగా.. ఇటీవల టీటీడీ కొత్త పాలకమండలిని ప్రభుత్వం ప్రకటించింది. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి బోర్డులో  మొత్తం 28 మందికి ఇందులో చోటు కల్పించింది.

ఇందులో ఏపీ నుంచి 8 మంది, తెలంగాణ నుంచి ఏడుగురు, తమిళనాడు నుంచి నలుగురు, కర్నాటక నుంచి ముగ్గురు, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించింది. 

28 మందితో టీటీడీ కొత్త పాలకమండలి: సభ్యులు వీరే

click me!