సెలవులు ఇచ్చింది ఎంజాయ్ చేయమని కాదు: ప్రజలపై సజ్జల అసహనం

Siva Kodati |  
Published : Mar 24, 2020, 04:53 PM ISTUpdated : Mar 24, 2020, 04:58 PM IST
సెలవులు ఇచ్చింది ఎంజాయ్ చేయమని కాదు: ప్రజలపై సజ్జల అసహనం

సారాంశం

గత కొన్ని రోజులుగా తీసుకుంటున్న చర్యల ఫలితంగా వ్యాధి తీవ్రత తగ్గిందన్నారు. అయితే లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రజల నుంచి ఆశించిన సహకారం రావడం లేదని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు

గత కొన్ని రోజులుగా తీసుకుంటున్న చర్యల ఫలితంగా వ్యాధి తీవ్రత తగ్గిందన్నారు. అయితే లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రజల నుంచి ఆశించిన సహకారం రావడం లేదని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం సెలవులు ప్రకటించింది వూళ్లకు వెళ్లి సెలవులు తీసుకోమని కాదని ఆయన తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంపై ప్రధాని, ముఖ్యమంత్రులు ప్రజల్లో అవగాహన కల్పించే చర్యలు తీసుకుంటున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Also Read:తెలంగాణ లాక్ డౌన్ : ఇకమీద బైటికొస్తే పోలీసుల సత్కారం ఇలాగే ఉంటది...

తాడేపల్లిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ గత కొద్దిరోజులుగా కరోనాపై సమీక్షలు చేస్తున్నారని ఆయన తెలిపారు. కరోనా వ్యాధి బారినపడకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన రాష్ట్రాల పరిస్ధితులు చోటు చేసుకోలేదని తెలిపారు.

రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ముందు నుంచి వైరస్ వ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకున్నామని సజ్జల గుర్తుచేశారు. వాలంటీర్ల సాయంతో విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించి, హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు అందించడం జరిగిందని రామకృష్ణారెడ్డి చెప్పారు.

Also Read:బ్రేకింగ్... చైనాలో మరో మహమ్మారి, హంటావైరస్ తో ఒకరి మృతి

ఈ ప్రక్రియ అంతా సజావుగా జరుగుతుండటం వల్లే ప్రభుత్వ యంత్రాంగం నిబ్బరంగా ఉందని ఆయన వెల్లడించారు. నిజంగా స్పందించే ప్రభుత్వం ఇలాగే ఉంటుందని తాము గర్వంగా చెబుతామని సజ్జల చెప్పారు. మనుషులకు దూరంగా ఉంటూ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం ద్వారానే కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేయగలమని రామకృష్ణారెడ్డి చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?