
రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరోగ్యశ్రీలోకి కొత్తగా 809 చికిత్సలను చేర్చుతూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తాజా చేరికలతో ఆరోగ్యశ్రీలో అందించే వైద్య చికిత్సల సంఖ్య 3,255కి చేరింది. వైద్య ఆరోగ్యశ్రీపై సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. తాజాగా పెంచిన వైద్య చికిత్సలతో ఆరోగ్యశ్రీపై ఏడాదికి రూ.2,894 .87 కోట్ల భారం పడుతుందని.. ఆరోగ్య ఆసరా కోసం మరో రూ.300 కోట్లు ఖర్చవుతుందని జగన్‌కి అధకారులు వివరించారు. ఆరోగ్యశ్రీని అత్యంత ప్రతిష్టాతక్మంగా అమలు చేస్తున్నామని.. ఎక్కడా బకాయిలు లేకుండా చూస్తున్నామని సీఎం తెలిపారు.
ఆరోగ్యశ్రీ కార్డుల్లో ప్రతి ఒక్కరి హెల్త్ హిస్టరీని రికార్డుల్లో నిక్షిప్తం చేయాలని జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిరంతరం ఈ రికార్డులను అప్‌డేట్ చేసుకుంటూ క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకునేలా ఉండాలని ఆయన సూచించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు గాయపడితే అలాంటి వారికి వెంటనే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలని.. వైద్య ఆరోగ్య శాఖలో ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ తప్పనిసరి చేయాలని జగన్ ఆదేశించారు.
Also REad:విద్యుత్ ఉత్పత్తిలో ఏపీలో మరో ముందడుగు:నెల్లూరులో జెన్ కో యూనిట్ జాతికి అంకితం చేసిన జగన్
ఇకపోతే.. విద్యుత్ ఉత్పత్తి రంగంలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. నెల్లూరు జిల్లాలోని ముత్తకూరు మండలం నేలటూరులో ఏపీ జెన్ కో మూడో యూనిట్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ ప్లాంట్ ను నిర్మించినట్టుగా ఆయన చెప్పారు.వైఎస్ఆర్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టును ప్రారంభించడం తన అదృష్టంగా ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములిచ్చిన 326 కటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చినట్టుగా సీఎం గుర్తు చేశారు. మరో 150 కుటుంబాలకు నవంబర్ లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులకు సీఎం జగన్ ధన్యవాదాలు చెప్పారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తప్పుడు హామీలు ఇచ్చారన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే చంద్రబాబునాయుడికి ఈ హామీలు గుర్తుండవని సీఎం ఎద్దేవా చేశారు.ఈ ప్రాంతంలోని 16,218 మత్స్యకారేతర కుటుంబాలకు ప్రభుత్వం రూ.35.74 కోట్ల సహాయం చేసిందని చెప్పారు. స్థానికుల కోసం ప్రత్యేకంగా రూ.25 కోట్లతో జెట్టీని నిర్మిస్తున్నట్టుగా సీఎం జగన్ హామీ ఇచ్చారు.ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సీఎం జగన్ చెప్పారు.ఈ ప్రాంత మత్స్యకారులకు రూ.25 కోట్లతో ప్రత్యేక జెట్టీని ఏర్పాటు చేస్తామన్నారు.