టెన్త్ పరీక్షల రద్దు... ఫలితాలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

By Arun Kumar PFirst Published Jul 12, 2021, 2:15 PM IST
Highlights

ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దుచేసిన నేపథ్యంలో విద్యార్థులను పాస్ చేసే విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 

అమరావతి: కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం విద్యార్థులందరినీ పాస్ చేయనుంది. ఈ విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్‌ పాస్‌ కు బదులు గ్రేడ్లు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఫార్మేటివ్, సమ్మేటివ్‌ మార్కుల ఆధారంగా గ్రేడ్ల ఖరారు చేయాలని నిర్ణయించారు. 

భవిష్యత్‌లో విద్యార్థుల ఉన్నత చదువులు, ఉద్యోగాలకు సమస్యలు రాకుండా వుండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఫార్మేటివ్, సమ్మేటివ్‌లలో ఎక్కువ మార్కులు వచ్చిన 3 సబ్జెక్టుల సగటు ఆధారంగా విద్యార్థుల గ్రేడ్ ను కేటాయించనున్నారు. 

read more ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు: మంత్రి ఆదిమూలపు సురేష్

సుప్రీం ఆదేశాల మేరకు టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం ఇటివలే నిర్ణయం తీసుకుంది. అయితే ఫలితాల కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇతర బోర్డులు పరీక్షలు రద్దు చేయడం వల్ల ఏపీ రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. 

click me!