కోలుకొంటున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్: సెక్రటరీ ఆర్పీ సిసోడియా

Published : Nov 19, 2021, 09:54 PM IST
కోలుకొంటున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్: సెక్రటరీ ఆర్పీ సిసోడియా

సారాంశం

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కోలుకొంటున్నారని గవర్నర్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా ప్రకటించారు.సోమవారం నాడు కరోనాతో ఆయన హైద్రాబాద్ లోని ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యం మెరుగు పడింది. కరోనా నుండి కోలుకొంటున్నాడని వైద్యులు తెలిపారు. కరోనాతో గవర్నర్ ఈ నెల 17 నుండి హైద్రాబాద్‌లోని ఓ  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాధారణంగానే ఆక్సిజన్ తీసుకుంటూ వేగంగా కోలుకుంటున్నట్లు వైద్యులు నిర్ధారించారని గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు.ఏఐజి హాస్పిటల్స్ కు చెందిన ఉన్నత స్థాయి వైద్యుల  బృందం నిరంతరం గవర్నర్ Biswabhusan Harichandan ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తుందని సిసోడియా పేర్కొన్నారు.ఈ నెల 15న  ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు corona సోకిందని వైద్యులు తెలిపారు. అంతకు ముందు రెండు రోజులుగా  AP Governor గవర్నర్ జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. 

also read:ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కి కరోనా: హైద్రాబాద్ ఆసుపత్రిలో చికిత్స

అంతేకాదు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ నెల 17న ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చేరారు.ఏపీ గవర్నర్ ఇటీవలనే ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ నుండి వెళ్లి వచ్చిన నాటి నుండి ఆయన అస్వస్థతతో ఉన్నారు. .ఏపీ గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ys jagan ఆరా తీశారు. ఏపీ గవర్నర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్యులతో సీఎం జగన్ మాట్లాడారు.  వరుసగా రెండు రోజులు సీఎం జగన్ గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. ఏపీ గవర్నర్ కరోనాతో హైద్రాబాద్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకొన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆసుపత్రికి వెళ్లారు. బిశ్వభూషణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యులతో ఆమె మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్