కారణమిదీ:ఏపీ ఆర్ధిక శాఖలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

By narsimha lodeFirst Published Aug 4, 2021, 9:23 AM IST
Highlights


ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే నెపంతో ముగ్గురు ఆర్ధికశాఖ ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. హెడ్ క్వార్టర్ ను వీడి వెళ్లొద్దని కూడ ప్రభుత్వం ఆదేశించింది.

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖలో ముగ్గురు ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటేసింది. ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే నెపంతో ఈ ముగ్గురిపై వేటు పడింది. ఆర్ధిక శాఖలో  ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు, ఒక అసిస్టెంట్ సెక్రటరీని సస్పెండ్  చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.సెక్షన్ ఆఫీసర్లు డి.శ్రీనిబాబు, కె.వరప్రసాద్ ల సస్పెండ్ చేసింది.

మరో వైపు అసిస్టెంట్ సెక్రటరీ నాగులపాటి వెంకటేశ్వర్లుపై కూడ ప్రభుత్వం సస్పెండ్ విధించింది.అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ వీడి వెళ్లకూడదని  కూడ ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ ఆర్ధిక శాఖ పనితీరుపై పీఏసీ చైర్మెన్ పయ్యావుల కేశవ్ ఇటీవల కాలంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయమై గవర్నర్ కు కూడ ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడ స్పందించారు.ఆర్ధిక శాఖకు చెందిన ఉద్యోగులు రెండు రోజుల క్రితం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ శాఖలో ముగ్గురు కీలకమైన అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడం ప్రస్తుతం చర్చకు దారితీసింది.


 

click me!