రెండు గ్రూపులు, రెండు కులాలను రెచ్చగొట్టేలా పోస్టింగ్స్.. యువతి అరెస్ట్.. !

By AN TeluguFirst Published Aug 4, 2021, 9:23 AM IST
Highlights

 సాయంత్రం 6 గంటలు దాటినా జ్యోతిశ్రీని విడుదల చేయకపోవడంతో.. టిడిపి నాయకులు సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. సీఐ సంజీవ్ కుమార్ ను కలిసి వివరాలు అడిగారు. అప్పి రెడ్డి ఫిర్యాదు మేరకు 153 ఎ, 120 రెడ్ విడ్ 505(2)సెక్షన్ కింద సిఐడి రాష్ట్ర కార్యాలయం కేసు నమోదు చేయడంతో జ్యోతిశ్రీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.

గుంటూరు : సోషల్ మీడియాలో రెండు గ్రూపులను రెచ్చగొట్టే విధంగా పోస్టింగ్స్ పెట్టారని నమోదైన కేసులో సిఐడి అధికారులు తెనాలిలో ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. రెండు గ్రూపులు, రెండు కులాలను రెచ్చగొట్టే విధంగా.. ఓ కులాన్ని అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారని ఎమ్మెల్సీ  లేళ్ల అప్పిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ గుంటూరు సిఐడి రీజనల్ కార్యాలయానికి దర్యాప్తు నిమిత్తం పంపారు.

సిఐడి సీఐ సంజీవ్ కుమార్ కేసు విచారిస్తున్నారు. దీంట్లో భాగంగా తెనాలికి చెందిన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు బొల్లినేని జ్యోతి శ్రీని అధికారులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గుంటూరులోని సిఐడి రీజనల్ కార్యాలయానికి తరలించారు. ఆమెను విచారించి సాయంత్రానికి స్టేషన్ బెయిల్ పై విడుదల చేస్తారని భావించారు.

అయితే సాయంత్రం 6 గంటలు దాటినా జ్యోతిశ్రీని విడుదల చేయకపోవడంతో.. టిడిపి నాయకులు సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. సీఐ సంజీవ్ కుమార్ ను కలిసి వివరాలు అడిగారు. అప్పి రెడ్డి ఫిర్యాదు మేరకు 153 ఎ, 120 రెడ్ విడ్ 505(2)సెక్షన్ కింద సిఐడి రాష్ట్ర కార్యాలయం కేసు నమోదు చేయడంతో జ్యోతిశ్రీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.

ఆమెను బుధవారం ఉదయం కోర్టులో హాజరుపరిచనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతిశ్రీతో మాట్లాడించాలని కోరగా అనుమతించారు. ఆమె మాట్లాడుతూ గంటలో పంపిస్తామని తీసుకువచ్చి.. రాత్రి వరకు నిర్బంధించారని తెలిపారు. తాను పార్టీపరంగా పోస్టింగ్స్ పెట్టానని, ఎవరినీ కించపరచలేదని కావాలనే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను రాత్రిపూట సిఐడి కార్యాలయం లో ఉంచడం పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

click me!