ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల:జూలైలో ప్రవేశ పరీక్షలు

Published : Apr 05, 2022, 04:44 PM ISTUpdated : Apr 05, 2022, 04:51 PM IST
ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల:జూలైలో ప్రవేశ పరీక్షలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. ఇప్పటికే ఎంసెట్ షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. 

అమరావతి: Andhra Pradesh రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు విడుదల చేసింది. ఇటీవలనే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను Telangana ప్రభుత్వం కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది జూలై 13న  PG లాసెట్,జూలై 22న ఈ సెట్, 25న ICET ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది జూలై 4 నుండి 12 వరకు  EAPCET, ప్రవేశ పరీక్షలు నిర్వహించనుంది.

ఈ ఏడాది మార్చి 23న ఏపీ  EAPCET ప్రవేశ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ ను ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ ఏడాది జూలై 4 నుండి 8వ తేదీ వరకు engineering పరీక్షలు నిర్వహించనున్నారు.జూలై 11,12 తేదీల్లో Agriculture పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వయాప్తంగా 134 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. తెలంగాణలో కూడా నాలుగు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.  ఈ ఏడాది ఏప్రిల్ 11న  నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్ననే ఎంసెట్ ప్రవేశ పరీక్షలను విడుదల చేసింది. ఐఐటీ జేఇఇ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఎంసెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు.

ఐఐటీ జేఇఇ  ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ మార్పులు చేయడంతో ఏపీ, తెలంగాన రాష్ట్రాలకు చెందిన ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్స్ లో కూడా రెండు రాష్ట్రాలు మార్పులు చేర్పులు చేశాయి. కొత్త షెడ్యూళ్లను రెండు రాష్ట్రాలు గత వారంలోనే ప్రకటించాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే