ఏపీ: ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

Siva Kodati |  
Published : Jul 09, 2021, 08:13 PM IST
ఏపీ: ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

సారాంశం

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆయా పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఇంజినీరింగ్‌, ఫార్మసీ, వ్యవసాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్‌ను ఆగస్టు 19 నుంచి 25 వరకు కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్‌ను సెప్టెంబర్‌ 17, 18న విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ప్రకటించింది. అలాగే సెప్టెంబర్‌ 19న ఈసెట్‌ (అనంతపురం జేఎన్‌టీయూ), సెప్టెంబర్‌ 21న ఎడ్‌సెట్‌ (విశాఖ ఏయూ) పరీక్షలు జరగనున్నాయి. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 22న లాసెట్‌, సెప్టెంబర్‌ 27 నుంచి 30 వరకు పీజీఈ సెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?