ఏపీకి ఊరట: కొత్తగా 3,040 కేసులు.. భారీగా పడిపోయిన కరోనా మరణాలు

Siva Kodati |  
Published : Jul 09, 2021, 07:33 PM IST
ఏపీకి ఊరట: కొత్తగా 3,040 కేసులు.. భారీగా పడిపోయిన కరోనా మరణాలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 3,040 మందికి కరోనా సోకగా.. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే నిన్న వైరస్ నుంచి 4,576 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1,00,103 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. 

ఆంధ్రప్రదేశ్‌కు భారీ ఊరట లభించింది. కరోనా మరణాలు, కేసులు బాగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 3,040 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,14,358కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 12,960కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి అనంతపురం 1,  తూర్పుగోదావరి 4, చిత్తూరు 2, నెల్లూరు 1, విజయనగరం 1, ప్రకాశం 1, గుంటూరు 1, కృష్ణ 1, పశ్చిమగోదావరి 1, శ్రీకాకుళంలో ఒక్కరు చొప్పున మరణించారు నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 4,576 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 18,71,098కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 1,00,103 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,27,99,245కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 30,300 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 85, చిత్తూరు 441, తూర్పుగోదావరి 659, గుంటూరు 211, కడప 158, కృష్ణ 242, కర్నూలు 77, నెల్లూరు 273, ప్రకాశం 316, శ్రీకాకుళం 106, విశాఖపట్నం 130 విజయనగరం 45, పశ్చిమ గోదావరిలలో 297 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 


 

PREV
click me!

Recommended Stories

Ultra-Modern Bhogapuram Airport: అత్యాధునిక హంగులతో భోగాపురం ఎయిర్ పోర్ట్ చూసారా?| Asianet Telugu
Nara Loeksh Pressmeet: ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ పోర్ట్ అవసరమా అన్నారు : లోకేష్ | Asianet Telugu