ప్రభుత్వ ఖర్చులపై పయ్యావుల ఆరోపణలు : ఏపీ ఆర్ధిక శాఖ కౌంటర్

Siva Kodati |  
Published : Jul 09, 2021, 06:06 PM ISTUpdated : Jul 09, 2021, 06:09 PM IST
ప్రభుత్వ  ఖర్చులపై పయ్యావుల ఆరోపణలు : ఏపీ ఆర్ధిక శాఖ కౌంటర్

సారాంశం

ఏపీ ప్రభుత్వ లెక్కలపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ శుక్రవారం వివరణ ఇచ్చింది. ఆయన ఆరోపణలు తప్పని కొట్టిపారేసింది.   

పీఏసీ ఛైర్మన్ పయ్యావుల ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ స్పందించింది. రూ. 40 వేల కోట్ల ఖర్చుకు లెక్కలు లేవని పయ్యావుల ఆరోపించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. కేశవ్ ఆరోపణల్ని ఖండించింది. అన్నీ పద్ధతిగానే జరుగుతున్నాయని ఆర్ధిక శాఖ వెల్లడించింది. ప్రతి ఏడాది కాగ్ పరిశీలనలను ఆర్ధిక శాఖ దృష్టికి తీసుకురావడం ఆనవాయితీ అని తెలిపింది. సర్దుబాట్లు ఎక్కువగా పీడీ అకౌంట్స్‌లోనే జరిగాయని ఆర్ధిక శాఖ పేర్కొంది. ఆర్ధిక శాఖ చర్యలను కాగ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్‌కు వివరిస్తామని తెలిపింది. 

కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ జమాఖర్చులపై పీఎసి చైర్మన్ పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేశారు.  ప్రభుత్వ జమాఖర్చుల నిర్వహణపై ఆయన గురువారం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు.  నలబై వేల కోట్ల రూపాయలకు సరైన లెక్కలు లేవని గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్లామని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు.

Also Read:జగన్ ప్రభుత్వ జమా ఖర్చులపై పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయడి ఆదేశాల మేరకు గవర్నర్ ను కలిసి ఆర్థిక శాఖలోని లోపభూయిస్టాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని, ప్రైవేటు వ్యవస్థను నడపడానికి ఏవిధంగా అకౌంటింగ్ ప్రాసెస్ వుంటుందో..రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి కూడా జమా ఖర్చులను ఏ నివేదికలో రూపొందించాలనే విధివిధానాలను దేశంలోని ప్రభుత్వాలు రూపొందించుకున్నాయని ఆయన చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Tourism Minister Kandula Durgesh Super Speech at Amaravati Avakaya Festival | Asianet News Telugu
IMD Rain Alert: అక్క‌డ వ‌ర్షాలు, ఇక్కడ చ‌లి.. బ‌ల‌ప‌డుతోన్న అల్ప పీడ‌నం