ఉల్లిగడ్డల కోసం క్యూ లైనులో నిలబడి వృద్దుడు సాంబయ్య మృతి

By narsimha lodeFirst Published Dec 9, 2019, 11:15 AM IST
Highlights

గుడివాడ రైతు బజారులో ఉల్లిగడ్డల కోసం ఎదురుచూస్తున్న సాంబయ్య అనే వ్యక్తి  గుండెపోటుతో సోమవారం నాడు మృతి చెందాడు. 


గుడివాడ: కృష్ణా జిల్లాలో ఉల్లిగడ్డల కోసం క్యూలో నిలుచున్న వృద్దుడు సాంబయ్య సోమవారం నాడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నెలకొంది. ఉల్లిగడ్డల కోసం క్యూ లైనులో తోపులాట చోటు చేసుకొంది. కొద్దిసేపట్లో ఉల్లిగడ్డలు  ఆయనకు దక్కేవి. కానీ, ఈ సమయంలోనే ఆయన క్యూ లైనులోనే కుప్పకూలాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.

కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన సాంబయ్య అనే వృద్దుడు  ఇవాళ ఉదయం ఏడు గంటలకు  ఉల్లిగడ్డల కోసం క్యూ లైనులో నిలబడ్డారు. సోమవారం నాడు ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో  క్యూ లైనులోనే సాంబయ్య కుప్పకూలిపోయాడు.

"  

స్థానికులు  రైతు బజారు సిబ్బంది సాంబయ్యను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ ఘటనతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా  పలు రాష్ట్రాల్లో ఉల్లిగడ్డలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉల్లిగడ్డల ధరలు విపరీతంగా పెరిగాయి.తమిళనాడు రాష్ట్రంలో  కిలో ఉల్లిగడ్డ ధర సుమారు రూ. 200లకు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిగడ్డ ధర రూ. 160కు చేరింది. కర్నూల్ మార్కెట్‌కు ఉల్లిగడ్డ రావడం కూడ తగ్గింది.

మహారాష్ట్రతో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు, వరదల కారణంగా ఉల్లి పంట దెబ్బతింది. దీంతో  ఉల్లి దిగుబడి పడిపోయింది.  ఉల్లి పంట పడిపోవడంతో  డిమాండ్ కూడ పెరిగింది. దీంతో ధరలు విపరీతంగా పెరిగాయి.ఉల్లి కొరత కారణంగా  ఎగుమతులను కేంద్రం నిషేధించింది. 

click me!