విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని శంకుస్థాపన వాయిదా: దసరాకు ముహుర్తం

Published : Aug 11, 2020, 11:18 AM ISTUpdated : Aug 11, 2020, 11:24 AM IST
విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని శంకుస్థాపన వాయిదా: దసరాకు ముహుర్తం

సారాంశం

విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 16వ తేదీన ఎగ్జిక్యూటివ్ రాజధానికి శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  

అమరావతి: విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 16వ తేదీన ఎగ్జిక్యూటివ్ రాజధానికి శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.  ఈ మేరకు మోడీ అపాయింట్ మెంట్ కోసం సీఎం జగన్ కోరారు. 

మరో వైపు మూడు రాజధానులపై హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులున్నాయి. మరో వైపు ఈ కార్యక్రమానికి ప్రధాని కూడ రావాలని ప్రభుత్వం కోరుకొంటుంది. ప్రధాని అపాయింట్ మెంట్  లభిస్తే సీఎం జగన్ స్వయంగా  మోడీని కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు.మూడు రాజధానుల విషయంలో ఏపీ హైకోర్టు యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించింది.ఈ నెల 14వ తేదీ వరకు స్టేటస్ కో  విధించింది.

ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం  కోరింది. షార్ట్ నోటీసులో ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ నెల 18 తర్వాత మంచి రోజులు లేవు. దీంతో దసరాకు విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ నెల 16వ తేదీన ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడినట్టుగా సమాచారం.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu