ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు జగన్ సర్కార్ తీపి కబురు తెలిపింది. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరులోపుగా ప్రమోషన్లకు సంబంధించిన ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది.ఈ మేరకు జగన్ సర్కార్ కసరత్తు చేస్తోంది. సుమారు వెయ్యి మందికి పదోన్నతులు దక్కనున్నాయి. కిందిస్థాయి ఉద్యోగులకు ఎక్కువగా ప్రమోషన్లు దక్కేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది.
మెకానిక్‌లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ డిపో మేనేజర్లు, కంట్రోలర్లు, గ్యారేజ్ సూపర్‌వైజర్లు, ట్రాఫిక్ సూపర్‌వైజర్లు తదితర ఉద్యోగులు ఎక్కువ మందికి ప్రయోజనం కలిగే విధంగా పదోన్నతుల ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యం సూత్రప్రాయంగా ఆమోదించింది.
undefined
also read:ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్
ప్రతి ఒక్క ఉద్యోగికి ఒక ర్యాంకు పెరగనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత తొలిసారిగా పదోన్నతులు కల్పించనుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెలాఖరుకు పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు రంగం సిద్దం చేస్తున్నారు.జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఎపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది జగన్ సర్కార్.