ఏపీ ఫైబర్‌నెట్ స్కాం: ముగ్గురికి సీఐడీ నోటీసులు, నేడు విచారణ

By narsimha lodeFirst Published Sep 14, 2021, 10:03 AM IST
Highlights

చంద్రబాబునాయుడు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్రమాలు చోటు చేసుకొన్నాయని జగన్ సర్కార్ విచారణకు ఆదేశించింది. ఏపీ సీఐడీ అధికారులు రూ. 320 కోట్ల అవినీతి జరిగిందని గుర్తించారు. ఈ మేరకు ముగ్గురికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.  

అమరావతి:చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో  ఏపీ ఫైబర్‌నెట్‌లో అక్రమాలు చోటు చేసుకొన్నాయని ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ స్కాంలో విచారణకు గాను ఏపీ సీఐడి అధికారులు ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. వేమూరి హరిప్రసాద్‌, సాంబశివరావు, గోపీచంద్‌కు నోటీసులు ఇచ్చింది.  ఇవాళ విచారణకు రావాలని  ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది.

ఏపీ ఫైబర్ నెట్ లో రూ. 320 కోట్ల టెండర్లు పిలిస్తే రూ. 121 కోట్ల అవినీతి జరిగిందని సీఐడీ గుర్తించింది. టెర్రా సాఫ్ట్‌కి టెండర్లు కట్టబెట్టేందుకు అవకతవకలకి పాల్పడ్డారని ఏపీ సీఐడీ తేల్చింది.ఈ విషయమై విచారణకు రావాలని గత ప్రభుత్వహయంలో ఏపీ ఫైబర్ నెట్ లో కీలకంగా పనిచేసిన ముగ్గురికి సీఐడీ నోటీసులు జారీ చేసింది.

బ్లాక్ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్‌ని రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించిన విషయాన్ని ఏపీ సీఐడీ గుర్తించింది. టెండర్లలో పాల్గొనేందుకు టెండర్ గడువుని వారం రోజులు పొడిగించారు. ఈ కుంభకోణంలో  ఇప్పటికే 19 మందిపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
 

click me!