రెండో పెళ్లి కోసం విడాకులు ఇవ్వమంటూ భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య..

By AN TeluguFirst Published Apr 21, 2021, 11:30 AM IST
Highlights

పెళ్లైన నాలుగేళ్లకే వేసిన మూడుముళ్లు భారంగా మారాయి. ఆ దాంపత్య జీవితానికి ప్రతిరూపాలుగా మూడేళ్లు, తొమ్మిది నెలల ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. సంతోషంగా ఉండాల్సిన నిండు కుటుంబంలో విడాకులు కలకలం రేపాయి. భార్యభర్తల మధ్య గొడవలు సర్ది చెప్పాల్సిన అత్తామామలు విడాకులకే వత్తాసు పలకడంతో ఆ కాపురం కష్టాల్లో పడింది. ఈ గొడవలతో మనస్తాపానికి గురైన ఆ భార్య బలవంతంగా తనువు చాలించింది. 

కట్టుకున్న భర్త అత్తమామల వేధింపులు తాళలేక రమాదేవి (21) ఉరివేసుకొని మృతి చెందిన సంఘటన భోగాపురం మండలంలోని ఓ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

మండలంలోని రావివలస గ్రామానికి చెందిన వేములవాడ రాముల బంగారి అలియాస్ శ్యామ్ దల్లిపేట గ్రామానికి చెందిన రమాదేవికి నాలుగేళ్ల కిందట వివాహమయ్యింది. వీరి కాపురం కొన్నేళ్లు అన్యోన్యంగా సాగింది. వీరికి కౌశిక్ (3) వాయిత్ (తొమ్మిది నెలలు) ఇద్దరు పిల్లలు ఉన్నారు.

పెళ్లయిన రెండేళ్ళ తర్వాత వీరి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వస్తుండేవి. భర్తతోపాటు అత్తమామలు తరచు రమాదేవిని వేధించడం మొదలుపెట్టారు. 15 రోజుల కిందట తన కుమారుడికి రెండో వివాహం చేసేందుకు అత్త అప్పలనరసమ్మ, మామ రమణ కలిసి తన కుమారుడు రాముల బంగారికి విడాకులు ఇవ్వాలంటూ కాగితంపై సంతకం పెట్టమని రమాదేవి పై ఒత్తిడి తెచ్చారు.

దీంతో ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడింది. ఈ విషయం తెలుసుకున్న రమాదేవి తల్లిదండ్రులు వారి బంధువులు కలిసి గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో వారిద్దరికీ సర్ది చెప్పి పంపించారు.  క్రమంలో మళ్లీ సోమవారం అత్తమామల తో పాటు భర్త కూడా విడాకులు ఇవ్వాలని రమాదేవిని వేదించడం మొదలుపెట్టారు. 

దీంతో జీవితంపై విరక్తి చెందిన రమాదేవి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అందరితో కలుపుగోలుగా ఉండే ఈమె చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి

సమాచారం అందుకున్న ఎస్సై యు మహేష్, తాసిల్దార్ డి. రాజేశ్వరరావు, గ్రామ సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్నిసుందరపేట సీహెచ్‌సీకి తరలించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

click me!