మందుబాబులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్: రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు ఓపెన్

By narsimha lode  |  First Published Jan 17, 2022, 8:52 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త తెలిపింది.  రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలను తెరిచి ఉంచనున్నారు.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మద్యం దుకాణాలను మరో గంట పాటు తెరిచేందుకు అనుమతించింది. తాజాగా ఇచ్చిన అనుమతుల మేరకు రాష్ట్రంలో రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి.

Andhra pradesh రాష్ట్రంలో liquor దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. రాష్ట్రంలో 2934 రిటైల్ మద్యం దుకాణాలున్నాయి.  ప్రతి రోజూ రాత్రి 9 గంటల వరకు మద్యం దుకాణాలను తెరిచి ఉంచనున్నారు. అయితే ఇవాళ్టి నుండి రాష్ట్ర ప్రభుత్వం మరో గంట పాటు మద్యం దుకాణాలను తెరిచి ఉంచాలని నిర్ణయించారు. దీంతో రాత్రి 10 గంటల పాటు దుకాణాలను తెరిచి ఉంచనున్నారు.

Latest Videos

undefined

స్రతి నెల ఏపీ ప్రభుత్వానికి రూ. 20వేల కోట్లు మద్యం ద్వారా ఆదాయం లభిఃస్తుంది. అయితే ప్రతి రోజూ గంట పాటు మద్యం దుకాణాలు తెరిచి ఉంచడం ద్వారా  మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు.

రాఁష్ట్రంలో మద్యం దుకాణాలు ఉదయం 11 గంటల నుండి 9 గంటల వరకు తెరిచి ఉంచుతున్నారు. మరో వైపు బార్లు, రెస్టారెంట్లు మాత్రం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఓపెన్ చేసి ఉంచుతున్నారు. అయితే మద్యం దుకాణాలకు మాత్రం ఓ గంట అదనంగా తెరవాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది.

 వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 4380 మద్యం దుకాణాలు ఉండేవి. అయితే మొదటి దశ లాక్ డౌన్ తర్వాత 2020 మే తర్వాత 3500 మద్యం దుకాణాలను ఏపీ ప్రభుత్వం 2934కి తగ్గించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ రవకు 2934 మద్యం దుకాణాలు రాష్ట్రంలో ఉంటాయి.  గతంలో ప్రకటించిన విధంగానే మద్యం వాకిన్ స్టోర్స్ ను కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది. వీటి ద్వారా  రూ. 7 నుండి 8 లక్షల మద్యం విక్రయాలు సాగించనున్నారు. 

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని జగన్  ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విషయంలో తీసుకొంటున్న నిర్ణయాలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

click me!