అత్యాచార నిందితులను పట్టుకోకుండా... బాధితులదే తప్పని చేతులు దులుపుకోవడం అన్యాయం: నారా లోకేష్

By telugu team  |  First Published Oct 11, 2021, 4:56 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అత్యాచార నిందితులను పట్టుకోకుండా బాధిత బాలికదే తప్పంతా అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేయడం అన్యాయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విశాఖ జిల్లా గాజువాక ఏరియా అగనంపూడిలో బాలికపై అత్యాచార ఘటనను ఆయన ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు.
 


అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి nara lokesh.. andhra pradesh ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలన్నీ అంతుచిక్కని రహస్యాలుగానే మిగిలిపోతున్నాయని ఆవేదన చెందారు. అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నదని, ఇది తగదని ఆగ్రహించారు. విశాఖ జిల్లా గాజువాక ఏరియాలోని అగనంపూడిలో బాలికపై అత్యాచార ఘటనను ప్రస్తావిస్తూ ఆయన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆ బాలికపై నిందితులు rape చేసి క్రూరంగా చంపారనే అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు.

Also Read: ఖాకీ చొక్కా తీసేసి వైసీపీ చొక్కా తొడుక్కున్నారు.. పోలీసులపై నారా లోకేశ్ ఆరోపణలు

Latest Videos

బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉన్నదని నారా లోకేష్ అన్నారు. వారి ఆవేదననూ పట్టించుకోకుండా పోలీసుల దర్యాప్తును కుంటుపరిచే రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తున్నట్టు తెలుస్తున్నదని తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టమవుతున్నదని ఆరోపించారు. బాధిత రజక కుటుంబం బతుకుదెరువు కోసం వలస వచ్చిందని, వారికి అన్యాయం జరిగితే నిందితులను కఠినంగా శిక్షించాల్సిన ప్రభుత్వ పెద్దలు బాధ్యత మరిచారని ఆగ్రహించారు. బాలికదే తప్పు అని చేతులు దులుపుకునే పనిలో నిమగ్నమవడం అన్యాయమని వాపోయారు.

click me!