జగన్ సర్కార్ కీలక నిర్ణయం: అసెంబ్లీకి మూడు రాజధానుల చట్టం ఉప సంహరణ బిల్లు

By narsimha lode  |  First Published Nov 22, 2021, 2:42 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టం ఉప సంహరణ బిల్లును ఏపీ అసెంబ్లీ ముందుకు తెచ్చింది. ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. 


అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ముందుకు మూడు రాజధానుల చట్టాలను  ఉపసంహరణ బిల్లులను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.  ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం నాడు మధ్యాహ్నం ఈ బిల్లును ప్రవేశ పెట్టారు.  ఈ బిల్లును ప్రవేశ పెట్టిన తర్వాత ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రసంగించారు.

three capitals వెనక్కి తీసుకోవాలని ఇవాళ నిర్వహించిన ap cabinet నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం మేరకు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది వికేంద్రీకరణ, సమ్మిళిత అభివృద్ది  చట్టాల  ఉపసంహరణ బిల్లును ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి buggana rajendranath reddyప్రవేశ పెట్టారు. 

Latest Videos

అభివృద్ది వికేంద్రీకరణ జరగాలని చంద్రబాబు నాయుడు  సర్కార్ నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సూచించిందని ఆయన గుర్తు చేశారు. ఏ రాష్ట్రాలైనా వెనుకబడిన ప్రాంతాలకే ప్రాధాన్యతను ఇచ్చాయన్నారు. అమరావతి ప్రాంతం సారవంతమైన, ఖరీదైన భూమి ఉందని దీన్ని వృధా చేయవద్దని కూడా శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందన్నారు.శివరామకృష్ణ కమిటీ నివేదికను అసెంబ్లీలో పెట్టకుండానే అప్పటి ప్రభుత్వం  రాజధానిపై నిర్ణయం తీసుకొన్నారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. 

ఒకే చోట అన్ని సంస్థలు పెడితే ఏ ప్రాంతం కూడా అభివృద్ది చెందదని మంత్రి తెలిపారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా హైద్రాబాద్ లో కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్థలను ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ది అన్నదే తమ అభిప్రాయమని  మంత్రి తెలిపారు.  అనుభవాలు, చారిత్రక ఆధారాలతోనే వికేంద్రీకరణ చేశామన్నారు.

also read:Three capital Bill : పది నిమిషాలు ఆగండి.. మొత్తం తెలుస్తాయి: కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

ముంబై  నగరం కంటే రెండింతలు రాజధానిని కడతామని చంద్రబాబు సర్కార్ గొప్పలు చెప్పుకొందని  మంత్రి గుర్తు చేశారు. 7500 చ.కి.మీ. విస్తీర్ణంతో రాజధానిని నిర్మిస్తామని చంద్రబాబు సర్కార్ ప్రకటనను మంత్రి ప్రస్తావించారు.  అయితే ముంబై నగరం మొత్తం 4,300 చ. కి.మీ మాత్రమే ఉందన్నారు మంత్రి.. భవిష్యత్తులపై ఆలోచన లేకుండానే ఊహజనితంగా రాజధానిని నిర్ణయించారని  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. చంద్రబాబు హయంలో ఏర్పాటు చేసిన కమిటీని తమ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కమిటీకి ఉన్న తేడాను వివరించారు. chandrababu కమిటీలో వ్యాపారవేత్తలు ఉంటే తాము ఏర్పాటు చేసిన కమిటీలో నిపుణులున్నారన్నారు. 

 చట్టం రద్దుకు కారణాలివీ..

మూడు రాజధానుల చట్టం రద్దు ఉపసంహరణ బిల్లు ప్రవేశ పెట్టడానికి కారణాలను ఏపీ ప్రభుత్వం అసెంబ్లీకి వివరించింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ఈ విషయాలను వివరించారు.భాగస్వామ్యులతో పూర్తి స్థాయి సంప్రదింపులు జరపకపోవడం, శాసనమండలిలో బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లిన కారణాలను ప్రభుత్వం తెలిపింది.  వికేంద్రీకరణపై మరింత అధ్యయనం  జరగాల్సి ఉందని ప్రభుత్వం అభిప్రాయ పడింది. తక్షణమే సీఆర్డీఏ చట్టం 2014 అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. 

మూడు రాజధానుల నిర్ణయాన్ని నిరసిస్తూ కొందరు రైతలు ముసుగులో ఆందోళన చేస్తున్నారని మంత్రి  ఆరోపించారు. తమ ప్రభుత్వం అందరిని ఒప్పించి ఈ నిర్ణయాలను తీసుకోవాలని భావిస్తోందన్నారు. ఈ విషయమై ఒకటి లేదా రెండు శాతం ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలనే ఉద్దేశ్యంతో తాము  ఈ చట్టాన్ని వెనక్కి తీసుకొన్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

click me!