ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీసిని ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచుకొనేందుకు అనుమతిని ఇచ్చింది.
అమరావతి: RRR సినిమాకు Cinema టికెట్ ధరలు పెంచుకొనేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.ఈ మేరకు గురువారం నాడు అనుమతిని ఇచ్చింది. ఈ నెల 14వ తేదీన ఇదే విషయమై రాజమౌళి, డీవీవీ దానయ్యలు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు.వంద కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన సినిమాలకు రెండు వారాల పాటు టికెట్ ధరలను పెంచుకొనేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అయితే ఈ విషయమై సినిమా నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాణానికి రూ.336 కోట్లు ఖర్చు అయిందని ప్రభుత్వానికి నిర్మాణ సంస్థ తెలిపింది. సినిమా టికెట్ల ధరల పెంపు ప్రజలపై భారం లేకుండా చూస్తామని కూడా ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి Perni Nani ఇటీవలనే ప్రకటించారు.ఆర్ఆర్ ఆర్ సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. ఆర్ఆర్ ఆర్ సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. సినిమా టికెట్ పై రూ. 75 పెంచుకొనేందుకు ప్రబుత్వం అంగీకిరించింది ఈ మేరకు ఇవాళ జీవోను జారీ చేసింది.
undefined
సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఈ నెల 6వ తేదీన జీవో జారీ చేసింది.కార్పోరేషన్లలోని నాన్ ఏసీ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.60లుగా, నాన్ ప్రీమియం టికెట్ రూ.40గా నిర్ణయించారు.ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లలో ప్రీమియం టికెట్ రూ.100, నాన్ ప్రీమియం టికెట్ రూ.70.గా నిర్ణయించారు.స్పెషల్ థియేటర్లలో ప్రీమియం టికెట్ రూ.125, నాన్ ప్రీమియం టికెట్ రూ.100 గా నిర్ణయం తీసుకొన్నారు. మల్టీప్లెక్సులలో రెగ్యులర్ టికెట్ రూ.150, రిక్లయినర్ సీట్ టికెట్ రూ.250 గా నిర్ణయించారు.
మున్సిపాలిటీల్లోని నాన్ ఏసీ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.50గా, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.30గా నిర్ణయం తీసుకొన్నారు. ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.80గా, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.60గా నిర్ణయించారు.స్పెషల్ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.100, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.80గా మల్టీప్లెక్సులలో రెగ్యులర్ సీట్ టికెట్ ధర రూ.125, రిక్లయినర్ సీట్ టికెట్ ధర రూ.250గా నిర్ణయించారు.
నగర పంచాయితీ, గ్రామ పంచాయితీల్లో నాన్ ఏసీ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.40, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.20, ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.70, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.50గా నిర్ణయించారు. స్పెషల్ థియేటర్లులో ప్రీమియం టికెట్ ధర రూ.90, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.70, మల్టీప్లెక్సులలో రెగ్యులర్ సీట్ టికెట్ ధర రూ.100, రిక్లయినర్ సీట్ టికెట్ ధర రూ.250.గా నిర్ణయించారు.ఈ టికెట్ ధరలకు అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు.
భారీ బడ్జెట్ సినిమాలు 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు. రూ.100 కోట్లు, అంతకుమించి బడ్జెట్ తో తెరకెక్కే చిత్రాలకు ఇది వర్తిస్తుంది. అయితే ఏపీ సర్కారు ఇక్కడో షరతు విధించింది. ఏపీలో 20 శాతం చిత్రీకరణ జరుపుకున్న చిత్రాలకే ఈ టికెట్ రేట్ల పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.