ప్రైవేట్‌లో కరోనా టెస్టులకు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు: ఏపీ ప్రభుత్వం

Published : Apr 25, 2021, 04:10 PM IST
ప్రైవేట్‌లో కరోనా టెస్టులకు అధిక ఫీజులు వసూలు చేస్తే  కఠిన చర్యలు: ఏపీ ప్రభుత్వం

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాల్లో చేసే పరీక్షలపై అధిక ఫీజులు వసూలు చేస్తే  చర్యలు తీసుకొంటామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది.  రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ ఈ విషయమై దృష్టి పెట్టింది.  

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాల్లో చేసే పరీక్షలపై అధిక ఫీజులు వసూలు చేస్తే  చర్యలు తీసుకొంటామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది.  రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ ఈ విషయమై దృష్టి పెట్టింది.

కరోనా బాధితులకు చేసే సిటీ స్కాన్, హెచ్ఆర్ సిటీ స్కాన్ ల పేరుతో చేసే దోపిడికి అడ్డుకట్ట వేసింది. ఈ మేరకు సీటీ స్కాన్ ధరను నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు ఈ ధరలను  ఏపీ ప్రభుత్వం ఆదివారం నాడు విడుదల చేసింది. సిటీ స్కాన్ లేదా హెచ్ఆర్ సిటీ స్కానింగ్ కు గరిష్టంగా రూ. 3 వేలను నిర్ణయించారు. 

also read:శ్రీశైలంలో కుంభోత్సవం.. కఠిన మార్గదర్శకాలు విడుదల, నిబంధనలు పాటిస్తేనే అనుమతి

స్కానింగ్ సమయంలో వాడే పీపీఈ కిట్లు, మాస్క్ ,స్ప్రైడ్  షీట్లతో కలిపి ఈ ధరను నిర్ణయించామని ప్రభుత్వం తెలిపింది. స్కానింగ్  అనంతరం అనుమానితుల వివరాలను కోవిడ్ డాష్ బోర్డు వెబ్ సైట్లో తప్పక నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ అన్నిజిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ఫీజు వసూలు చేస్తే  చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం హెచ్చరించింది. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu