YS Vivekananda Reddy Murder Case: ఎర్రగంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డిలకు హైకోర్టు షాక్

By narsimha lode  |  First Published Feb 16, 2022, 2:34 PM IST


మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డిలకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. దస్తగిరి అఫ్రూవర్ గా మారడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను  కొట్టివేసింది.



గుంటూరు: మాజీ మంత్రి YS Vivekananda Reddy హత్య కేసులో నిందితులుగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి, Yerra Gangi Reddy లు దాఖలు చేసిన పిటిషన్లను AP High Court బుధవారం నాడు కొట్టివేసింది.  దస్తగిరి అఫ్రూవర్ గా అనుమంతించడాన్ని సవాల్ చేస్తూ వీరిద్దరూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు వీటిని కొట్టివేసింది. 

Dastagiri అఫ్రూవర్ గా మారడాన్ని సవాల్ చేస్తూ 2021 డిసెంబర్ 14న ఎర్ర గంగిరెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఉమా శంకర్ రెడ్డి కూడా ఇదే డిమాండ్ తో పిటిషన్ దాఖలు చేశారు.  ఈ కేసులో దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మేరకు సీబీఐ కీలక సాక్ష్యాలను సేకరించింది. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టుకు కూడా సమర్పించింది. 

Latest Videos

వివేకా హత్యకు సంబంధించిన సంచలన విషయాలను  దస్తగిరి సిబిఐ అధికారులకు  ఓ వాంగ్మూలం ఇచ్చాడు. ఇందులో వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఎర్ర గంగిరెడ్డి రూ. 40 కోట్లు ఇస్తాడని Umashankar Reddy   తనకు చెప్పినట్టు దస్తగిరి పేర్కొన్నాడు. అంతేకాదు హత్య జరిగిన తర్వాత తనతో సహా కొంతమందిమి శంకర్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు అప్పుడు కూడా తమకేమీ సమస్య రాకుండా ఎర్ర గంగిరెడ్డి చూసుకుంటారని శంకర్ రెడ్డి హామీ ఇచ్చారని దస్తగిరి పేర్కొన్నాడు. 

ఎర్ర గంగిరెడ్డి, Sunil Yadav, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి  సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి పగ పెంచుకున్నారని చెప్పారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గంగిరెడ్డి మోసం చేశారని మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాష్‌లకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్టు దస్తగిరి ఆ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. 

MLC ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్‌ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని స్టేట్‌మెంట్‌లో తెలిపారు. తనను కావాలనే ఓడించారని, మీ కథ తేలుస్తానంటూ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్‌రెడ్డిలకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్లు దస్తగిరి  ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు.2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ హత్య చోటు చేసుకొంది.ఈ హత్య సమయంలో టీడీపీ అధికారంలో ఉంది. చంద్రబాబునాయుడు ఈ హత్యపై విచారణకు సిట్ ను ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన  వైసీపీ సర్కార్ కూడా సిట్ దర్యాప్తును ఏర్పాటు చేసింది. ఈ విచారణలో కీలక విషయాలను సీబీఐ సేకరించింది. వివేకానందరెడ్డి వద్ద డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి కీలక సమాచారాన్ని సీబీఐకి ఇచ్చాడు.

వివేకానందరెడ్డి హత్యపై 2021 ఆగస్ట్ 30న దస్తగిరి  స్టేట్‌మెంట్ ఇచ్చారు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను మిగతా నిందితుల లాయర్లకు కోర్టు ఇచ్చింది. కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో దస్తగిరి బడా నేతల పేర్లు ప్రస్తావించారు. సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఉంది. ఎర్ర గంగిరెడ్డి  , సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

click me!