మూడు రాజధానులను ప్రజలు ఆమోదించారు: ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

By narsimha lode  |  First Published Mar 16, 2021, 7:49 PM IST

మూడు రాజధానులు ఉంటాయని మేము చెప్పాము... దాన్ని ప్రజలు కూడా ఆమోదించారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి  చెప్పారు.
సీఎం వైయస్‌ జగన్‌  ఏనాడూ అమరావతికి అన్యాయం చేస్తామని చెప్పలేదన్నారు


అమరావతి: మూడు రాజధానులు ఉంటాయని మేము చెప్పాము... దాన్ని ప్రజలు కూడా ఆమోదించారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి  చెప్పారు.
సీఎం వైయస్‌ జగన్‌  ఏనాడూ అమరావతికి అన్యాయం చేస్తామని చెప్పలేదన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేయలేం కాబట్టి, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెట్టాలని నిర్ణయించారన్నారు.

మంగళవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఏకగ్రీవ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం అన్నట్లుగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విమర్శించింది. నిజానికి ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకలేదని ఆయన ఎద్దేవా చేశారు.

Latest Videos

చంద్రబాబు సొంత నియోజకవర్గాలు చంద్రగిరి, కుప్పంలో కూడా టీడీపీ దారుణంగా ఓడిపోయిందన్నారు. చివరకు మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఘోర పరాభవం తప్పలేదు. మీ భాష, ప్రజలపై విమర్శలు చేశారు. వారికి రోషం ఉంది కాబట్టే మీకు బుద్ధి చెప్పారని చెప్పారు.

కానీ మీరు కుల, మత రాజకీయాలు చేశారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. చివరకు ఆలయాలపైనా రాజకీయాలు చేశారని ఆయన విమర్శించారు.కానీ మీరు ఎంతసేపూ వ్యక్తిగత విమర్శలు. ప్రజాదరణ కోల్పోయి, ఏం చేయాలో తోచక, విచక్షణ కోల్పోయి, కులాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారన్నారు. 

 అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఓడిపోతే ఈవీఎంల ట్యాంపర్‌ జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు జరిగితే, అంత కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 

click me!