హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ బాలాజీపై ప్రభుత్వం వేటేసింది. గత మాసంలో పేకాట ఆడుతూ బాలకృష్ణ పీఏ బాలాజీ పోలీసులకు చిక్కాడు. కర్ణాటకలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ విషయమై అందిన నివేదిక మేరకు బాలాజీ డిప్యుటేషన్ ను రద్దు చేశారు.
అనంతపురం: హిందూపురం ఎమ్మెల్యే Balakrishna పీఏ Balajiపై ప్రభుత్వం వేటేసింది. గత మాసంలో కర్ణాటకలో పేకాట ఆడుతూ బాలాజీ పట్టుబడ్డారు. ఈ విషయమై కర్ణాటక Police కేసు కూడా నమోదు చేశారు. పోలీసుల కేసు ఆధారంగా బాలాజీని బాలకృష్ణ PAగా కొనసాగుతున్నారు. అయితే డిప్యూటేషన్ పై ఆయన బాలకృష్ణ పీఏగా కొనసాగుతున్నారు. అయితే ఈ విషయమై ప్రభుత్వానికి అందిన నివేదిక మేరకు బాలాజీ డిప్యుటేషన్ ను ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాదు ఆయనను అడల్ట్ ఎడ్యుకేషన్ సూపర్‌వైజర్ గా నియమించారు.
ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దుల్లోని నగిరేర వద్ద 19 మంది రాజకీయ ప్రముఖులు, ఉద్యోగులను అరెస్ట్ చేశారు పోలీసులు.నిందితులను గుడిబండ కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు. ఈ ఏడాది మార్చి 21వ తేదీన పోలీసులు పేకాట ఆడుతున్న విషయమై కచ్చితమైన సమాచారం అందుకుని దాడి చేశారు.
కర్ణాటక పోలీసుల దాడిలో బాలకృష్ణ పీఏ బాలాజీతో పాటు హిందూపురానికి చెందిన పలువురు రాజకీయ నేతలు కూడా పట్టుబడ్డారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డవారిలో వైసీపీ, టీడీపీలకు చెందినవారున్నారు. హిందూపురం వైసీపీ కన్వీనర్ శ్రీరామ్ రెడ్డి ఉన్నారు. హిందూపురంలో బాలకృష్ణ లేని సమయంలో అక్కడి రాజకీయ వ్యవహారాలను కూడా బాలాజీ చక్కబెడుతున్నారు. అలాంటి బాలాజీ పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కడం టీడీపీలో కలకలానికి కారణమైంది.
గతంలో బాలకృష్ణ దగ్గర పీఏగా పనిచేసిన శేఖర్ వ్యవహారం కూడా బాగా చర్చనీయాంశమైంది. బాలకృష్ణ లేని సమయంలో టీడీపీ నేతలపై పెత్తనం చేయడమే కాకుండా పార్టీని గ్రూపులుగా విడగొట్టారని. శేఖర్ పై ఆరోపణలున్నాయి. దీంతో శేఖర్ ను బాలకృష్ణ పీఏ పదవి నుండి తప్పించారు. ఈ విషయమై చివరకు చంద్రబాబు జోక్యం చేసకోవాల్సి వచ్చింది.
శేఖర్ ను తప్పించిన బాలకృష్ణ ఆయన స్థానంలో బాలాజీని నియమించుకున్నారు.
గతంలో పనిచేసిన పీఏ శేఖర్ పార్టీలో గ్రూపుల గొడవకు కారణమయ్యారు. పార్టీ నేతలను కూడా పట్టించుకోరనే విమర్శలు శేఖర్ పై ఉన్నాయి. అయితే బాలాజీ మాత్రం ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ సూచనలతో హిందూపురం వ్యవహరాలు చక్కబెడుతారు. అయితే బాలాజీ వైసీపీ నేతలతో కలిసి పేకాడుతూ దొరకడం తెలుగు తమ్ముళ్లలో చర్చకు దారి తీసింది. అయితే బాలాజీ డిప్యుటేషన్ ను ప్రభుత్వం రద్దు చేసింది.కొత్త పీఏ కోసం బాలకృష్ణ ఇప్పుడు వేట సాగించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు పీఏల అనుభవంతో కొత్త పీఏనైనా ఏరికోరి తీసుకోవాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.