నిరుద్యోగభృతికి ఏపీ కేబినెట్ ఆమోదం: ఆగష్టు 15 నుండి ధరఖాస్తుల స్వీకరణ

First Published Aug 2, 2018, 3:22 PM IST
Highlights

నిరుద్యోగులకు ప్రతి నెలా భృతి ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆగష్టు 15వ తేదీ నుండి  నిరుద్యోగులకు భృతి ఇచ్చే విషయమై  ధరఖాస్తులను  స్వీకరించే అవకాశం ఉంది.  నిరుద్యోగ భృతికి సంబంధించిన విధివిధానాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

అమరావతి: నిరుద్యోగులకు ప్రతి నెలా భృతి ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆగష్టు 15వ తేదీ నుండి  నిరుద్యోగులకు భృతి ఇచ్చే విషయమై  ధరఖాస్తులను  స్వీకరించే అవకాశం ఉంది.  నిరుద్యోగ భృతికి సంబంధించిన విధివిధానాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఏపీ కేబినెట్ సమావేశం  ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం నాడు  అమరావతిలో జరిగింది. గత ఎన్నికల సమయంలో  తమ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు భృతిని ఇవ్వనున్నట్టు టీడీపీ ప్రకటించింది.అర్హులైన నిరుద్యోగులకు ప్రతి నెలా ఇవ్వనున్నారు.  నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి  యువ నేస్తం అనే పేరును ఖరారు చేశారు.

దీనికి తోడు ఏపీ రాష్ట్రంలో మరో 20 వేల  ప్రభుత్వ  ఉద్యోగాలను  భర్తీ చేయాలని  నిర్ణయం తీసుకొన్నారు. ఇందులో సుమారు 9వేల టీచర్ పోస్టులున్నాయి. నిరుద్యోగ భృతికి సంబంధించి ఆగష్టు 15వ తేదీ నుండి  ధరఖాస్తులను ఆహ్వానించనున్నట్టు  ప్రభుత్వం ప్రకటించింది.  ఏపీ ఎలక్ట్రిక్ వాహనాల ముసాయిదాలో మార్పులు చేర్పులు చేశారు.

ఇప్పటికే నిరుద్యోగ భృతికి సంబంధించి ప్రభుత్వం వెబ్‌సైట్‌ను అందుబాటులోకి  తీసుకు వచ్చింది.ఈ వెబ‌్సైట్‌లో నిరుద్యోగులు  తమ సమాచారాన్ని అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. మరో వైపు మావోయిస్టు పార్టీపై ఏడాదిపాటు నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయాన్ని తీసుకొన్నారు.

ఈ వార్త చదవండి:నిరుద్యోగభృతికి ఏపీ కేబినెట్ ఆమోదం: ఆగష్టు 15 నుండి ధరఖాస్తుల స్వీకరణ


 

click me!