ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Published : Feb 03, 2021, 04:25 PM ISTUpdated : Feb 03, 2021, 04:41 PM IST
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

సారాంశం

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు విడుదల చేసింది.  

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు విడుదల చేసింది.

బుధవారం నాడు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా మంత్రి చెప్పారు. ఈ ఏడాది జూన్ ఐదో తేదీ వరకు పదోతరగతి క్లాసులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 

ఈ ఏడాది ఏడు పేపర్లు మాత్రమే ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో పేపర్ కు వంద మార్కులు ఉంటాయని మంత్రి తెలిపారు. సైన్స్ లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో సైన్స్ పేపర్ కు 50 మార్కుల చొప్పున ఉంటాయని మంత్రి వివరించారు.ఈ ఏడాది మే 5 నుండి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా మంత్రి తెలిపారు. మార్చి 31 నుండి ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

ఈ ఏడాది జూలై 21 నుండి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభించనున్నట్టుగా ఆయన తెలిపారు.  కరోనా నేపథ్యంలో గత విద్యాసంవత్సరంలో చాలా రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలను నిర్వహించకుండానే విద్యార్ధులను ప్రమోట్ చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Hero Ghattamaneni Jayakrishna Speech: జై బాబు.. బాబాయ్ కి నేను పెద్ద ఫ్యాన్ | Asianet News Telugu
Deputy CM Pawan Kalyan: కాకినాడ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం | Asianet Telugu