రైతు సంక్షేమానికి ఏపీ సర్కార్ తన బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇవాళ ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. పలు రంగాల కింద బడ్జెట్ లో వ్యవసాయానికి జగన్ సర్కార్ అధిక నిధులు కేటాయించింది.
అమరావతి: రైతు సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం AP Budget 2022 లో పెద్ద పీట వేసింది. Farmers సంక్షేమం కోసం పలు పథకాల కింద బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులను కేటాయించింది. ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Buggana Rajendranath Reddy ఇవాళ AP Assemblyలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.
వైఎస్ఆర్ రైతు భరోసా కింద రూ. 3,900 కోట్లు, వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా కింద రూ. 1802.04 కోట్లను YS Jagan సర్కార్ కేటాయించింది.రైతులకు వడ్డీ లేని రుణాలకు రూ. 500 కోట్లను ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించింది. రైతు భరోసా పథకం కింద ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ.20,117.59 కోట్ల రైతు కుటుంబాలకు బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని ఆర్ధిక మంత్రి చెప్పారు.ప్రధాన మంత్రి కిసాన్ పథకం ద్వారా అందించే రూ. 6 వేల అదనంగా బడ్జెట్ నుండి రైతుల బ్యాంకు ఖాతాలకు రూ. 7,500 జమ చేస్తున్నామని ఆర్ధిక మంత్రి తెలిపారు.
undefined
YSR ఉచిత పంటల భీమా పథకాన్ని Niti Ayog ప్రశంసించిన విషయాన్ని ఆర్ధిక మంత్రి గుర్తు చేశారు. 2019 నుండి ప్రత్యక్షంగా నగదు బదిలీ పథకం ద్వారా 29.05 లక్షల మంది రైతులకు రూ.3,707.02 కోట్ల భీమా క్లెయిమ్ చేసినట్టుగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద 2019-20 రబీ, 2020-21 ఖరీఫ్ లో లక్ష రూపాయాల పంట రుణాల కోసం 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 12 లక్షల 30 వేల మంది అర్హులైన రైతులకు బ్యాంకు ద్వారా రూ. 207.72 కోట్లు వడ్డీ రాయితీలు అందించినట్టుగా ఆర్ధిక మంత్రి తెలిపారు. చంద్రబాబు సర్కార్ పెండింగ్ లో ఉంచిన 65.01 లక్షల మంది రైతుల ఖాతాలో రూ.1,165 కోట్లను అందించినట్టుగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు.
రాష్ట్రంలో 10,776 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా మంత్రి తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పలు రకాల సేవలను అందిస్తున్న విషయాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రైతులకు పంటల ధరల స్థీరీకరణ కోసం రూ. 3 వేల కోట్లతో ధరల స్థీరీకరణ నిధిని ఏర్పాటు చేసినట్టుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.