కుట్రలతో అధికారంలోకి రావడమే టీడీపీ పాలసీ: చంద్రబాబుపై సజ్జల ఫైర్

Published : Mar 29, 2022, 02:52 PM ISTUpdated : Mar 29, 2022, 03:46 PM IST
కుట్రలతో అధికారంలోకి రావడమే టీడీపీ పాలసీ: చంద్రబాబుపై సజ్జల ఫైర్

సారాంశం

కుట్రలతో  అధికారంలోకి రావడమే టీడీపీ పాలసీ అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.   

అమరావతి: ప్రస్తుతం టీడీపీ అవసాన దశలో ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అభిప్రాయపడ్డారు.NTR  హాయంలోని TDP వేరు, ఇప్పుడున్న టీడీపీ వేరన్నారు.. టీడీపీది 40 ఏళ్ల సంబరం కాదన్నారు. 27 ఏళ్ల సంబరమే అని సజ్జల  రామకృష్ణారెడ్డి చెప్పారు.  ఎన్టీఆర్ నుండి Chandrababu చేతిలోకి  టీడీపీ మారడానికి మధ్య చోటు చేసుకొన్న పరిణామాలపై కూడా చర్చించాలని ఆయన టీడీపీ నేతలకు సూచించారు. ఈ సమయంంలో ఓ వర్గం మీడియా  కూడా కీలక పాత్ర పోషించిందన్నారు.

అమరావతిలో ఆయన మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. టీడీపీకి బాకా ఊదడమే ఎల్లో మీడియా పని అని ఆయన అన్నారు.ప్రజాభిమానంతో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారన్నారు. జనం నుండి వచ్చిన నాయకుడు  సీఎం వైఎస్ జగన్ అని Sajjala Ramakrishna Reddy  గుర్తు చేశారు.మీడియా మేనేజ్‌మెంట్ తో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.  మీడియా మేనేజ్‌మెంట్ తోనే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.కుట్రలతో ఎలా అధికారంలోకి రావాలనేది టీడీపీ పాలసీ అని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. .  ఇటీవల కాలంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలను అడ్డుకోవడమే టీడీపీ పనిగా పెట్టుకొందన్నారు. చంద్రబాబునాయుడు అసలు అసెంబ్లీకి ఎందుకు రాలేదో తెలియదన్నారు. తొలుత ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకే రానని తొలుత ప్రకటించారన్నారు. కానీ  ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చి  సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గించారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

టీడీపీ ఆవిర్భవించి ఇవాళ్టికి 40 ఏళ్లు పూర్తైంది. ఎన్టీఆర్ 40 ఏళ్ల క్రితం హైద్రాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీడీపీని ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ ఇవాళ 40 ఏళ్ల సంబరాలను నిర్వహించుకొంటుంది. ఈ సంబరాలపై సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు..

టీడీపీకి బాగా ఊదడమే ఎల్లో మీడియా పని అని సజ్జల విమర్శించారు. రెండు సార్లు సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేశామన్నారు.మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేసినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులను కూడా తమ ప్రభుత్వం తీరుస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. టీడీపీ హయంలో ప్రవేశ పెట్టిన ఒక్క మంచి పథకం ఏదైనా ఉందా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

తమ ప్రభుత్వం వల్ల ప్రతి కుటుంబంలో చిరునవ్వులు వెల్లివిరుస్తున్నాయన్నారు.. తమ పాలనను దేశమంతా పరిశీలిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. కోవిడ్ పరిస్థితుల్లో కూడా రాష్ట్రం ఆర్ధికంగా ముందుకు వెళ్లిందన్నారు. టీడీపీ హయంలో అప్పులు చేయకుండా ప్రభుత్వాన్ని నడిపారా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.చరిత్రలో ఎవరూ చేయలేనంతగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు.

 1995 ఆగష్టులో టీడీపీలో సంక్షోభం చోటు చేసుకొంది.  ఎన్టీఆర్ నుండి చంద్రబాబునాయుడు పార్టీని కైవసం చేసుకొన్నారు. టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత  కొన్ని రోజులకే ఎన్టీఆర్ మరణించారు.  లక్ష్మీ పార్వతి పార్టీని ఎక్కువ కాలం నడపలేకపోయింది.
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: అవకాశం చూపిస్తే అందిపుచ్చుకునే చొరవ మన బ్లడ్ లోనే వుంది | Asianet News Telugu
Chandrababu Speech:నన్ను420అన్నా బాధపడలేదు | Siddhartha Academy Golden Jubilee | Asianet News Telugu