అమరావతి ల్కాండ్ స్కాంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వాగతించారు. సిట్ విచారణలో వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు.
గుంటూరు: అమరావతి పేరుతో చంద్రబాబు సర్కార్ భారీ అవినీతికి పాల్పడిందని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అమరావతి పేరు చెప్పి దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో కచ్చితంగా అరెస్టులు జరుగుతాయన్నారు.
అమరావతి సహా చంద్రబాబు సర్కార్ చేపట్టిన కార్యక్రమాలపై సిట్ దర్యాప్తుపై ఏపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తును ఏర్పాటు చేసింది. ఈ విషయమై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. ఈ విషయమై బుధవారంనాడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
undefined
టీడీపీ హయంలో జరిగిన అవినీతిపై సిట్ ఏర్పాటు చేసినట్టుగా ఆయన చెప్పారు. , రాష్ట్ర సంపదకు నష్టం కల్గించే కుట్రలను బయటకు తీస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. విధానపరమైన నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం కలిగిస్తే తప్పేనన్నారు. సిట్ దర్యాప్తులో మరిన్న విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు.
గతంలో జరిగిన తప్పులపై సమీక్ష జరగాల్సిందేనన్నారు. అమరావతి ల్కాండ్ స్కాంపై సిట్ దర్యాప్తుపై చంద్రబాబు ఆయన ముఠా ఎందుకు భయపడిందని ఆయన ప్రశ్నించారు. ఈ స్కాంలో తమ పాత్ర లేకపోతే దర్యాప్తు కోరవచ్చు కదా అని చంద్రబాబును సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
also read:టీడీపీకి షాక్: అమరావతి స్కాంపై సిట్ దర్యాప్తుపై హైకోర్టు ఆదేశాలు కొట్టేసిన సుప్రీం
సిట్ దర్యాప్తుపై స్టే కోరడమంటే అందులో ఏదో మతలబు ఉన్నట్టేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అమరావతిలో జరిగిన అవినీతిని బయటపెడతామన్నారు. దేశంలోనే భూమికి సంబంధించిన అతి పెద్ద స్కాంగా ఆయన పేర్కొన్నారు. రియల్ ఏస్టేట్ స్కామ్ కు రాజధాని అని పేరు పెట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు హస్తం ఉందన్నారు.