చంద్రబాబును బొక్కలో వేయడం ఖాయం...: మంత్రి జోగి రమేష్ (వీడియో)

By Arun Kumar PFirst Published May 3, 2023, 3:16 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టవడం ఖాయమని మంత్రి జోగి రమేష్ అన్నారు. 

అమరావతి : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పేరిట అక్రమాలకు పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జైలుకెళ్లడం ఖాయమని మంత్రి జోగి రమేష్  అన్నారు. కేవలం స్టే ల మీద బ్రతుకుతున్న చంద్రబాబుకు సుప్రీం కోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని అన్నారు. అమరావతి భూకుంభకోణంలో చంద్రబాబు పాత్ర బయటపడనుందని... ఆయన బొక్కలోకి వెళ్లనున్నాడని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. 

గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఏపీ రాజధాని నిర్మాణంలో అవకతవకలు జరిగాయని... టిడిపి నాయకులకు, తనవారికి లబ్ది చేసేలా ఆనాటి సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారని వైసిపి ఆరోపిస్తోంది. వైసిపి అధికారంలోకి వచ్చి సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతి నిర్మాణం పేరిట జరిగిన భూకుంభకోణం, అక్రమాలపై సిట్ ఏర్పాటుచేసారు. అయితే ఈ  సిట్ ఏర్పాటును నిరసిస్తూ టీడీపీ నేతలు హైకోర్టుకు వెళ్లగా గతేడాది సెప్టెంబర్ 15న  స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.దీనిపై జగన్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లగా సిట్ దర్యాప్తుపై స్టే విధించడాన్ని అత్యున్నత న్యాయస్థాయం వ్యతిరేకించింది. 

Latest Videos

వీడియో

 

ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై మంత్రి జోగి రమేష్ స్పందిస్తూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సిట్ ద్వారా అమరావతిలో జరిగిన అక్రమాలపై నిగ్గుతేలుస్తుంటే ఎక్కడ తన బండారమంతా బయటపడుతుందోనని చంద్రబాబు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారన్నారు. తన అవినీతిపై విచారణ జరక్కుండా హైకోర్టులో అడ్డుకున్నాడని... కానీ ఇవాళ సుప్రీంకోర్టుకు సరయిన తీర్పు ఇచ్చిందని మంత్రి అన్నారు. 

Read More  ప్రజల ఆశీస్సులున్నంతవరకు ఏమీ చేయలేరు: భోగాపురం ఎయిర్ పోర్టుకు జగన్ శంకుస్థాపన

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేసిన అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు సుప్రీం అనుమతివ్వడం హర్షనీయమని అన్నారు. రాజధాని ఏర్పాటు, భూముల విషయంలో చంద్రబాబు ఎలా దోచుకున్నాడో, బంధుమిత్రుల ద్వారా ఎలా లబ్ది పొందాడో బయటకు రానుందని అన్నారు. చంద్రబాబు అక్రమాలన్ని బయటకు వస్తాయని... అవినీతి బట్టబయలు అవుతుందన్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం చంద్రబాబు అరెస్టయి బొక్కలోకి వెళ్లడం ఖాయమని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. 

click me!