ఆర్-5 జోన్‌పై అన్యాయమైన డిమాండ్‌ను కొట్టేసింది: హైకోర్టు తీర్పుపై సజ్జల

Published : May 05, 2023, 04:37 PM IST
ఆర్-5 జోన్‌పై అన్యాయమైన డిమాండ్‌ను కొట్టేసింది:   హైకోర్టు తీర్పుపై సజ్జల

సారాంశం

జోన్-5 పై   హైకోర్టు తీర్పును  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  స్పందించారు.  హైకోర్టు తీర్పుతో  రైతులది న్యాయమైన డిమాండ్ కాదని తేలిందన్నారు.   

అమరావతి: రైతుల అన్యాయమైన డిమాండ్ ను  హైకోర్టు కొట్టివేసిందని  ఏపీ ప్రభుత్వ సలహదారు  సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు.ఆర్-5 జోన్ పై  ఏపీ హైకోర్టు తీర్పుపై   ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు  సజ్జల రామకృష్ణారెడ్డి  శుక్రవారంనాడు స్పందించారు. ఆర్ 5 జోన్ పై హైకోర్టు తీర్పును ఆయన  స్వాగతించారు.  రాజధాని అంటే  ప్రజలందరూ ఉండే ప్రాంతంగా  ఆయన పేర్కొన్నారు.

పేదలకు  ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం  చేశారని ఆయన  టీడీపీపై  మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశ్యంతో అమరావతిలో  ఇళ్ల పట్టాలను  అడ్డుకొనే ప్రయత్నం  చేశారని ఆయన చెప్పారు.  

పేదలకు  ఐదు శాతం  ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే నిబంధనను  ఆనాటి టీడీపీ సర్కార్ పట్టించుకోలేదని  సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు  చేశారు.  మూడు   ప్రాంతాల అభివృద్దిలో  భాగంగానే  అమరావతి అభివృద్ది  సాగుతుందన్నారు.


 


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం పొంచివుందా..? ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు
Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu