వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు: ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం వివరణ ఇదీ..

Published : Sep 02, 2020, 05:48 PM IST
వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు: ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం వివరణ ఇదీ..

సారాంశం

 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంస్కరణల్లో భాగంగానే రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్లకు మీటర్లను బిగిస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం ప్రకటించారు.


అమరావతి: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంస్కరణల్లో భాగంగానే రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్లకు మీటర్లను బిగిస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం ప్రకటించారు.

బుధవారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉచిత విద్యుత్ అందించే విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించడంతో ఇబ్బందులు కలగవని ఆయన భరోసా ఇచ్చారు.

ఇప్పుడు మీటర్లు బిగించి తర్వాత ఏదో చేస్తామని ఆందోళన అనవసరమని ఆయన చెప్పారు. స్మార్ట్ ఫోన్లను ఉచితంగానే బిగిస్తామని ఆయన చెప్పారు. వ్యవసాయ కనెక్షన్ల పేరిట ఎవరైనా దుర్వినియోగం చేస్తే మీటర్ద ద్వారా బయటపడే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

రైతు ఖాతా నుండి డెబిట్ పద్దతిన డిస్కంలకు చెల్లింపులు చేయనున్నట్టుగా ఆయన చెప్పారు. రూ.7130 కోట్ల కోట్లను ఫీడర్ల ఆధునీకీకరణ కోసం ఆయన ఖర్చు చేయనున్నట్టుగా ఆయన తెలిపారు. గత ప్రభుత్వం  బాకీలను తీరుస్తూ విద్యుత్ వ్యవస్థను సంస్కరిస్తున్నట్టుగా ఆయన వివరించారు.

also read:రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా: మీటర్లు బిగించనున్న ఏపీ సర్కార్

ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించడంపై కొందరు రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని  ఆయన చెప్పారు. ఈ రకమైన తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన రైతులను కోరారు. 

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?