అవసరం కోసమే అప్పు, రాబడి పెరిగింది: ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

By narsimha lode  |  First Published Mar 5, 2021, 2:09 PM IST

తమది సంక్షేమ ప్రభుత్వమని ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. అవసరం ఉన్నందునే అప్పు చేశామని ఆయన తేల్చి చెప్పారు. 


అమరావతి: తమది సంక్షేమ ప్రభుత్వమని ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. అవసరం ఉన్నందునే అప్పు చేశామని ఆయన తేల్చి చెప్పారు. 

శుక్రవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  కాగ్ రిపోర్టు ద్వారా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కొన్ని పత్రికల్లో వార్తలొచ్చాయన్నారు. గత ప్రభుత్వం ప్రాధాన్యత లేని వాటిపై ఖర్చు చేసిందని ఆయన చెప్పారు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక పరిస్థితి దెబ్బతిందన్నారు. డబ్బున్న రాష్ట్రాల పరిస్థితి వేరు, ఏపీ రాష్ట్ర పరిస్థితి వేరన్నారు.

Latest Videos

 గత ప్రభుత్వంలో చేసిన ఖర్చు కనిపించేలా  లేదన్నారు. వ్యాపార సంస్థలు అన్ని ఆగిపోయాయని తెలిపారు. కోవిడ్ వల్ల పరిస్థితిలో ఇబ్బంది ఉంది కనుకే ఎఫ్‌ఆర్‌బీఎం లిమిట్‌ను కేంద్రం కూడా 5 శాతానికి పెంచిందని ఆయన గుర్తు చేశారు.

ఆదాయం లేకున్నా ప్రజల కొరకు ఖర్చు చేసి ఆదుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఇబ్బందులు ఉన్నప్పుడు డబ్బును పంపింగ్ చేస్తే అదే డబ్బులు ఎకానమీలోకి వస్తుందన్నారు. .అందుకే అప్పు చేశామని తాము గర్వంగా చెపుతున్నామన్నారు. 

2020లో రాబడి భారీగా పెరిగిందని దీనికి కారణం ప్రభుత్వం డబ్బు పంపింగ్ చేయడమే అని వివరించారు. పన్నెతర ఆదాయం కూడా కోవిడ్ సమయంలో ఎక్కువ వచ్చిందన్నారు.

click me!