ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్, ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించిన జగన్

By narsimha lode  |  First Published Mar 5, 2021, 1:39 PM IST

మీడియాలో, సోషల్ ‌మీడియాలో దురుద్దేశ పూర్వక ప్రచారం చేస్తున్నారని.. ఈ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ వేదికలుగా  పనిచేయనుందన్నారు.అసలు వాస్తవాలు ఏమిటో  సాక్ష్యాలతో ఫ్యాక్ట్ చెక్ తేల్చనుందని ఆయన తెలిపారు.
 



హైదరాబాద్:  మీడియాలో, సోషల్ ‌మీడియాలో దురుద్దేశ పూర్వక ప్రచారం చేస్తున్నారని.. ఈ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ వేదికలుగా  పనిచేయనుందన్నారు.అసలు వాస్తవాలు ఏమిటో  సాక్ష్యాలతో ఫ్యాక్ట్ చెక్ తేల్చనుందని ఆయన తెలిపారు.

శుక్రవారం నాడు సీఎం జగన్ ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్‌, ట్విట్టర్‌ అకౌంట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Latest Videos

undefined

దురుద్దేశపూర్వక ప్రచారంమీద అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. దురుద్దేశ పూర్వకంగా ఈ ప్రచారం మొదట ఎక్కడనుంచి మొదలయ్యిందో దాన్ని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.

ఒక వ్యక్తి ప్రతిష్టను, ఒక వ్యవస్థ ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికీ లేదన్నారు. వ్యక్తిగత ఉద్దేశాలతో వ్యవస్థలను భ్రష్టుపట్టించే హక్కు ఎవ్వరికీ లేదని ఆయన చెప్పారు.

వ్యవస్థలను తప్పుదోవపట్టించే పనులు ఎవరూ చేయకూడదని ఆయన కోరారు. ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపడుతున్న కార్యక్రమాలపైనా వ్యవస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  వేరే కారణాలతో ఇలాంటి దురుద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వాటికి ఎక్కడోచోట ముగింపు పలకాలని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. 

click me!