ఏపీకి నిధులివ్వాలి: కేంద్ర మంత్రి నిర్మలాతో బుగ్గన భేటీ

By narsimha lodeFirst Published Sep 24, 2020, 2:44 PM IST
Highlights

రాష్ట్రానికి రావాల్సి నిధులను విడుదల చేయాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు.
 

అమరావతి: రాష్ట్రానికి రావాల్సి నిధులను విడుదల చేయాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు.

గురువారం నాడు ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి న్యూఢిల్లీలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

రామాయపట్నం పోర్టు, పారిశ్రామిక రాయితీలు, ప్రత్యేక హోదా అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చినట్టుగా బుగ్గన మీడియాకు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 700 కోట్లు బిల్లుల పున: పరిశీలన చేయాలని కోరామన్నారు. 

ఈ నెల 23న ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.


 

click me!