ప్రభుత్వంతో చర్చలు.. రేపు స్వల్పంగా థియేటర్ల ప్రారంభం: ఏపీ ఫీలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్

By Siva KodatiFirst Published Jul 29, 2021, 3:43 PM IST
Highlights

మెయింటెనెన్స్ కూడా లేకుంటే థియేటర్లు ఓపెన్ చేయలేరని ఎగ్జిబిటర్లు తెలిపారు. కరోనా వైరస్, టికెట్ల ధరలు, థియేటర్ల ప్రారంభం తదితర అంశాలపై అసోసియేషన్ గురువారం విజయవాడలో చర్చించింది. రేపు రాష్ట్రంలో కొన్ని థియేటర్లు ప్రారంభమవుతాయని వారు చెప్పారు. 

భారత్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ వుందన్నారు ఏపీ ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. కరోనా వైరస్, టికెట్ల ధరలు, థియేటర్ల ప్రారంభం తదితర అంశాలపై అసోసియేషన్ గురువారం విజయవాడలో చర్చించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో షూటింగ్‌లకు అనుమతి దక్కేలా ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిందని ప్రశంసించారు. ఇతర భాషలకు చెందిన సినిమాలు సైతం ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్‌లు జరుపుకుంటున్నాయని వారు తెలిపారు.

దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి టికెట్ ట్యాక్స్ తీసుకొచ్చారని.. దీని వల్ల మారుమూల ప్రాంతాల్లో వున్న థియేటర్లు కూడా తిరిగి ప్రాణం పోసుకున్నాయని చెప్పారు. ఎంతమంది ప్రేక్షకులు వస్తే.. అంతమందికే ట్యాక్స్ వుంటుందని ఎగ్జిబిటర్లు తెలిపారు. దీని వల్ల చిత్ర పరిశ్రమ పుంజుకుందని.. రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని జగన్ కూడా అమలు చేయాలని కోరారు. మెయింటెనెన్స్ కూడా లేకుంటే థియేటర్లు ఓపెన్ చేయలేరని ఎగ్జిబిటర్లు తెలిపారు. రేపు రాష్ట్రంలో కొన్ని థియేటర్లు ప్రారంభమవుతాయని వారు చెప్పారు. 

click me!