నా ఇంటిని ముంచబోయి పేదోళ్ల ఇళ్లు ముంచారు: జగన్ సర్కార్ పై చంద్రబాబు ఫైర్

By Nagaraju penumalaFirst Published Aug 20, 2019, 2:44 PM IST
Highlights

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఫ్లడ్ మానిటరింగ్ కూడా చేయలేకపోయిందని విమర్శించారు. ఎన్నడూ లేని విధంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను పట్టించుకోకుండా తన ఇంటి చుట్టే తిరిగారని ఆరోపించారు. 

విజయవాడ: కృష్ణా వరదలు సహజంగా వచ్చిన వదరలు కావంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తన ఇంటిని ముంచుదామని వైసీపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. అయితే తన ఇళ్లును మంచలేకపోయారు గానీ పేదోళ్ల ఇళ్లను మాత్రం ముంచారని ఆరోపించారు. 

కృష్ణాజిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు నాయుడు వారిని ఓదార్చారు. గీతానగర్, భూపేష్ గుప్తానగర్, తారకరామానగర్ లలో చంద్రబాబు పర్యటించారు. వదర ముంపు బాధితులను పరామర్శించిన బాబు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా బాధితులు చంద్రబాబు వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. ప్రభుత్వం నుంచి తమకు సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  అనంతరం మాట్లాడిన చంద్రబాబు విజయవాడ ముంపు ప్రాంతాల్లో రిటర్నింగ్ వాల్ నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానికులందరికీ ఇళ్లపట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఫ్లడ్ మానిటరింగ్ కూడా చేయలేకపోయిందని విమర్శించారు. ఎన్నడూ లేని విధంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. 

ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను పట్టించుకోకుండా తన ఇంటి చుట్టే తిరిగారని ఆరోపించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం బాధితులకు ఎలాంటి సహాయం అందించలేదని ఆరోపించారు. బాధితులకు కనీసం భోజన సదుపాయాలు కూడా కల్పించలేకపోయారని మండిపడ్డారు. అన్న క్యాంటీన్లు ఉంటే వరద బాధితుల ఆకలి తీర్చేవని వాటిని కూడా తొలగించేశారని మండిపడ్డారు. అన్న క్యాంటీన్లు ఏ పాపం చేశాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వరదను అంచనా వేసి ప్రాజెక్టుల్లో కొంత నీటిని ముందే విడుదల చేసి ఉంటే ఇంతటి వరద వచ్చేది కాదన్నారు. తన ఇంటిని ముంచడానికే పైన నీళ్లను ఆపి ఒకేసారి వదిలారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తాను ఇంట్లో లేనప్పుడు నోటీసులు ఇవ్వడానికి వచ్చారంటూ ఇదేమైనా న్యాయమా అంటూ ప్రశ్నించారు. తాను ఉంటున్న ఇళ్లు మునిగిపోతే ఓనర్‌కు ఇబ్బంది అవుతుంది, మీకెందుకు బాధ అంటూ మంత్రుల తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. 

సీఎం జగన్ మాటలకు చేతలకు పొంతన లేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో మాటలు కోటలు దాటాయని విమర్శించారు. కానీ చేతలు గడప కూడా దాటలేదంటూ విమర్శించారు. ఇకనైనా పరిపాలన అంటే ఎంటో జగన్ తెలుసుకుని ప్రజలకు అండగా నిలిస్తే బాగుంటుందని సూచించారు చంద్రబాబు.  

click me!