రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్లలో జీవోలను ఎందుకు పెట్టడం లేదని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. రహస్య, అతి రహస్య జీవోలు ఉంటాయా అని హైకోర్టు అడిగింది. అన్ని జివోలను వెబ్ సైట్లో ఉంచాలని సూచించింది.
అమరావతి: ప్రభుత్వ జీవోలను పూర్తిస్థాయిలో వెబ్ సైట్ లో పెట్టకపోవడం పట్ల AP High court ఆగ్రహం వ్యక్తం చేసింది .వెబ్‌సైట్‌లో జీవోలను ఎందుకు పెట్టడం లేదని అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. సాఫీగా జరిగే ప్రక్రియకు ఎందుకు ఆటంకం కల్పిస్తున్నారంటూ Ap Government పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.జీవోల్లో 5శాతమే website లో ఉంచుతున్నారని, ప్రభుత్వ తీరు సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకమని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.అయితే అతి secret జీవోలు మాత్రమే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయట్లేదని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు అనంతరం హైకోర్టు ధర్మాసనం స్పందించింది. జీవోలు రహస్యం, అతిరహస్యమని ఎలా నిర్ణయిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అన్ని జీవోల వివరాలు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 28వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
also read:ప్రభుత్వ జీవోలు రహస్యమా...! జగన్ సర్కార్ తీరుపై హైకోర్టు ఆశ్చర్యం
ఈ ఏడాది ఆగష్టు 17 నుండి ఆన్ లైన్ లో జీవోలను అప్ లోడ్ చేయడం నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ విషయమై పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు జీవోలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశించినా కూడా అన్ని జీవోలను పూర్తి స్థాయిలో అప్ లో డ్ చేయడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది ఇవాళ విచారణ సందర్భంగా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.