పీఆర్సీ: ఉద్యోగ సంఘాలతో మరోసారి భేటీ కానున్న వైఎస్ జగన్

Published : Jan 07, 2022, 02:26 PM ISTUpdated : Jan 07, 2022, 02:31 PM IST
పీఆర్సీ: ఉద్యోగ సంఘాలతో మరోసారి భేటీ కానున్న వైఎస్ జగన్

సారాంశం

 పీఆర్సీపై ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పీఆర్సీపై స్పష్టత రానుంది.

అమరావతి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు మరోసారి బేటీ కానున్నారు. ఇవాళ పీఆర్సీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.prc పై జాయిట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని  Employees సంఘాల నేతలు సీఎం Ys Jagan తో గురువారం నాడు  భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో స్పష్టత రాలేదు. రెండు మూడు రోజుల్లో పీఆర్సీపై స్పష్టత ఇవ్వనున్నట్టుగా సీఎం ప్రకటించారు. ఈ విషయమై నిన్నటి నుండి సీఎం జగన్ అధికారులతో చర్చిస్తున్నారు.

శుక్రవారం నాడు ఆర్ధిక శాఖాధికారులతో సీఎం జగన్ సమావేశమయ్యారు.ఉద్యోగ సంఘాల ఫిట్‌మెంట్ ఇస్తే రాష్ట్ర ఖజానాపై పడే భారం గురించి కూడా చర్చించారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాలతో భేటీకి జగన్ నుండి ఆహ్వానం అందింది.

 పీఆర్సీ విషయమై కనీసం 55 శాతం ఇవ్వాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కోరుతున్నారు.  సీఎంతో సమావేశానికి ముందే ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోటు చేసుకొన్నానని జగన్ తెలిపారు. అన్నింటిని స్ట్రీమ్‌లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తామని జగన్ తేల్చి చెప్పారు.

మెరుగైన పీఆర్సీని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా ఆలోచించాలని జగన్ ఉద్యోగ సంఘాలను కోరారు. ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతో ఉన్నానని సీఎం జగన్ గురువారం నాటి సమావేశంలో చెప్పారు.

ఉద్యోగ సంఘాల నేతలు 45 నుండి 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఈ సమావేశంలో కోరినట్టుగా సమాచారం. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రాక్టికల్ గా ఆలోచించాలని సీఎం కోరినట్టుగా తెలుస్తోంది. అయితే ఉద్యోగ సంఘాలు కోరుతున్నట్టుగా కాకుండా ఆర్ధిక శాఖ అధికారులు ప్రతిపాదించినట్టుగా కాకుండా మధ్య మార్గంగా ఫిట్‌మెంట్ ను ఖరారు చేయాలని జగన్ భావిస్తున్నారు.ఈ మేరకు నిన్నటి నుండి కసరత్తు చేశారు. ఇవాళ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలకు జగన్ స్పష్టత ఇచ్చే  అవకాశం ఉంది.

రాస్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు sajjala Ramakrishna Reddy, ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Buggana rajendranath reddy ఉద్యోగ సంఘాల నేతలకు వివరించారు. ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్‌మెంట్ విషయమై  కార్యదర్శుల కమిటీ ఇచ్చిన 14.29 ఫిట్‌మెంట్ ను తాము అంగీకరించబోమని  ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. 27 శాతానికి పైగా ఫిట్‌మెంట్ ఉంటేనే చర్చలకు వస్తామని కూడా సీఎస్   Sameer Sharma కు ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వ సలహదారు, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు కూడా ఉద్యోగ సంఘ నేతలతో జరిగిన చర్చల వివరాలను సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఫిట్‌మెంట్ విషయమై ఆలోచించాలని కూడా ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వ పెద్దలు సూచించారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఉద్యోగ సంఘాల నేతలతో పీఆర్సీపై జగన్ చర్చించనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu
డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu