నిమ్మగడ్డను ఏదో చేసి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు: ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామ్ రెడ్డి

Published : Jan 24, 2021, 02:01 PM IST
నిమ్మగడ్డను ఏదో చేసి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు: ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామ్ రెడ్డి

సారాంశం

 ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఏదో చేసి  జైలుకు వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఏపీ ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామ్ రెడ్డి చెప్పారు.  

అమరావతి:  ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఏదో చేసి  జైలుకు వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఏపీ ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామ్ రెడ్డి చెప్పారు.

ఆదివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల విషయంలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన చెప్పారు. 
ప్రాణాలను రక్షించుకొనే హక్కు రాజ్యాంగం కల్పించిందనే చెప్పానని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ చిత్తశుద్దితో వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు.

రేపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా కూడ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉందా అని ఆయన ప్రశ్నించారు.

నామినేషన్ల ప్రక్రియ జరిగే అవకాశం ఉందా అని ఆయన అడిగారు. నామినేషన్ పత్రాలు సిద్దంగా లేవు,ఓటర్ల జాబితా ప్రింట్ కాలేదని ఆయన చెప్పారు.అభ్యర్ధులకు ఓటర్ల జాబితా ఇవ్వాలి.. ఇప్పుడు సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు.

also read:ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామ్ రెడ్డి వ్యాఖ్యలు: పోలీసుల దర్యాప్తు

నిఘా తనపై కాదన్నారు.  ఎవర్నెవర్నో కలుస్తున్న నిమ్మగడ్డపైనే పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నామినేషన్ పత్రాలు సిద్దంగా లేవన్నారు. ఓటర్ల జాబితా ప్రింట్ కాని విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 

కొన్ని పాత పోలింగ్ కేద్రాల్లో నాడు నేడు పనులు జరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొన్ని పోలింగ్ కేంద్రాలను తిరిగి నిర్మించేందుకు పడగొట్టారు.ఎలాంటి సన్నద్దత లేకుండా ఎన్నికల నిర్వహణ సాధ్యమా అని ప్రశ్నించారు.
 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu