
దేశంలో ఇంధన సంక్షోభం నేపథ్యంలో ఒక్కొక్క రాష్ట్రంలో అనధికార విద్యుత్ కోతలు (power cut) మొదలయ్యాయి. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. తాజాగా ఇంధన సంక్షోభంపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి (ap electricity minister) బాలినేని శ్రీనివాసరెడ్డి (balineni srinivasa reddy) స్పందించారు. బొగ్గు కొరత (coal shortage) దేశవ్యాప్తంగా ఉందని ఆయన వెల్లడించారు. అన్ని రాష్ట్రాలు ఏదో ఒక స్థాయిలో విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయని, మన రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం తాత్కాలికమేనని వివరించారు.
బొగ్గు కొరత దృష్ట్యా రాష్ట్ర విద్యుత్ రంగంలో (electricity crisis) నెలకొన్న ఇబ్బందులు త్వరలోనే తొలగిపోతాయని బాలినేని వెల్లడించారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని మంత్రి వివరించారు. జెన్ కో కేంద్రాలను (ap genco) అనాలోచితంగా మూసివేయలేదని బాలినేని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే వేలం ద్వారా విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ALso Read:థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత: అలా చేస్తే చర్యలు, రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్
బొగ్గు కొరత కారణంగా జెన్ కో యూనిట్లను పూర్తిస్థాయిలో నడపలేని పరిస్థితి ఉందని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాయలసీమ థర్మల్ ప్లాంట్‌లో వార్షిక మరమ్మతులు చేపట్టామని మంత్రి వివరించారు. బొగ్గు కొరత వల్ల థర్మల్ యూనిట్లను మూసివేయాల్సి వచ్చేదని బాలినేని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి (telangana) బొగ్గు కొరత లేదని, అక్కడున్న బొగ్గు నిల్వలను ఏపీకి ఇవ్వడంలేదని బాలినేని ఆరోపించారు. శ్రీశైలంలో (srisailam) మాత్రమే ఏపీ విద్యుత్ ఉత్పత్తి చేసుకోగలుగుతోందని.. దీనిని రాజకీయం చేయొద్దని మనవి చేస్తున్నా" అంటూ మంత్రి ట్వీట్ చేశారు.
మరోవైపు Thermal power కేంద్రాలకు బొగ్గు కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మంగళవారం నాడు కీలక సూచనలు చేసింది.ప్రజల అవసరాల కోసం తమ పరిధిలో ఉన్న విద్యుత్‌ను ఉపయోగించుకోవాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు సహాయం చేయాలని కోరింది. సెంట్రల్ ఆపరేటింగ్ స్టేషన్ల వద్ద 15 శాతం విద్యుత్ ఏ రాష్ట్రాలకు కూడా కేటాయించకుండా ఉంటుంది.అత్యవసర విద్యుత్ అవసరం ఉన్న రాష్ట్రాలకు కేంద్రం తన కోటా నుండి విద్యుత్ ను అందించనుంది.