ఆత్మహత్యలొద్దు... మీ కోసం జగన్ సర్కార్ తో పోరాడతాం: కాంట్రాక్టర్లకు చంద్రబాబు భరోసా

By Arun Kumar PFirst Published Oct 12, 2021, 2:42 PM IST
Highlights

వైసిపి ప్రభుత్వం బకాయిపడ్డ ప్రతి పైసా చెల్లించేలా చూస్తామని... అందుకోసం తెలుగుదేశం పార్టీ పోరాటానికి సిద్దమని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.  కాంట్రాక్టర్లు, గుత్తేదారులేవ్వరూ ఆత్మహత్యకు పాల్పడవద్దని సూచించారు.

అమరావతి: గ్రామాల అభివృద్ధికి సహకరించిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం వేధించడం దుర్మార్గమని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. న్యాయస్థానాలు ఆదేశించినా ఉపాధిహామీ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదు? గ్రామాలను అభివృద్ధి చేసిన గుత్తే దారులపై కక్ష సాధింపులా? అంటూ వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. 
 
''jagan ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు, అభివృద్ధి పనులు చేపట్టడానికి గుత్తేదారులు ముందుకు రావడంలేదు. చివరకు న్యాయస్థానాలు సైతం ఉపాధి పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని ఎన్నిసార్లు ఆదేశించినా ప్రభుత్వం లెక్కలేనితనంగా వ్యవహరిస్తోంది'' అని chandrababu naidu ఆగ్రహం వ్యక్తం చేసారు. 

''ఏలూరులో రంజిత్ అనే కాంట్రాక్టర్ కు బిల్లులు ఇవ్వకుండా వేధించడంతో ఆత్మహత్యాయత్నం చేశారు. రంజిత్ కు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇటీవల అనంతపురం జిల్లాలో వికలాంగ గుత్తేదారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు'' అని చంద్రబాబు ఆవేదక వ్యక్తం చేసారు.

''ఉపాధి నిధులతో గ్రామాల అభివృద్ధికి పాటుపడిన వారికి బిల్లులు చెల్లించకుండా వేధిస్తారా.? గ్రామాల అభివృద్ధికి కృషిచేసిన వారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. వారిని ఆర్థికంగా అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం దారుణం'' అని మండిపడ్డారు.

READ MORE  చంద్రబాబు కుప్పం పర్యటన వాయిదా.. కారణమదేనా...

''జగన్ సర్కార్ నిలిపేసిన బిల్లులకు 12శాతం వడ్డీతో చెల్లించాలని న్యాయస్థానం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయినా ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. కేంద్రం ఇచ్చిన ఉపాధి నిధులను పక్కదారి పట్టించారు. కేంద్ర ప్రభుత్వం కోర్టులో రాష్ట్రానికి ఉపాధి నిధులు విడుదల చేశామని... విచారణ పూర్తైందని రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని ప్రమాణపత్రం దాఖలు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విచారణ జరుగుతోందని... నిధులు రాలేదని కోర్టుకు సైతం అబద్ధాలు చెప్పింది'' అని పేర్కొన్నారు.

''ఇప్పటికే చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులను చెల్లించకపోవడంతో టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రంలో కొత్తగా ఏ అభివృద్ధి పనులు చేపట్టాలన్నా గుత్తేదారులు భయపడుతున్నారు. సుమారు రూ.80 వేల కోట్ల మేర కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బకాయిలు పెట్టింది'' అని తెలిపారు. 

''ప్రభుత్వం బిల్లలు చెల్లించడంలేదని గుత్తేదారులెవరూ ఆందోళన చెందవద్దు. ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు. ప్రతిపైసా అందే వరకు బాధితుల తరపున టీడీపీ పోరాటం చేస్తుంది'' అని చంద్రబాబు స్పష్టం చేసారు.

click me!