ఏపీలో టెన్త్ ప్రశ్నాపత్రం లీకైందనే వదంతులపై ఏపీ విద్యాశాఖ కమిషనర్ వివరణ ఇచ్చారు. ఏపీలో టెన్త్ తెలుగు కాంపోజిట్ ప్రశ్నాపత్రం లీక్ కాలేదన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Tenth Class ప్రశ్నపత్రం లీకైందనే విషయమై సాగుతున్న ప్రచారంపై ఏపీ విద్యాశాఖ బుధవారం నాడు వివరణ ఇచ్చింది. ఇవాళే ఏపీలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
Telugu కాంపోజిట్ పేపర్ Whats App గ్రూప్‌లో ప్రత్యక్షం అయ్యింది. ఉదయం 9 గంటలకు తెలుగు కాంపోజిట్ పరీక్ష ప్రారంభమైంది. అయితే ఉదయం 9:57 గంటలకు సోషల్ మీడియాలో ఈ పేపర్ Social Media లో వైరల్ గామారింది. విషయం తెలియడంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. మరో వైపు చిత్తూరు జిల్లాలో కూడా ప్రశ్నాపత్రం లీకైనట్టుగా ప్రచారం సాగింది.
ఈ విషయాన్ని వెంటనే Chittoor జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డికి డీఈవో పురుషోత్తం ఫిర్యాదు చేశారు. పరీక్ష ప్రారంభమైన గంటన్నర తర్వాత ప్రశ్నాపత్రంను ఎవరో కావాలనే ఉద్దేశంతో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారని డీఈవో అంటున్నారు. పేపర్ లీక్ ఎక్కడ జరిగిందో తమకు తెలియదని.. వెంటనే ఆరా తీశామన్నారు.
ఇదిలా ఉంటే కలెక్టర్ హరినారాయణన్ ఈ పేపర్ లీక్ వ్యవహారంపై స్పందించారు. జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని.. విద్యార్థులు చక్కగా పరీక్ష రాస్తున్నారన్నారు. పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తర్వాత సోషల్ మీడియాలో పేపర్ లీక్ అయిందని డీఈవోకు సమాచారం వచ్చిందని వెంటనే ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. విద్యార్థులు ఎవరూ వదంతులు నమ్మొద్దని సూచించారు.
ఈ విషయమై ఏపీ విద్యాశాఖ కమిషనర్ స్పందించారు. పరీక్ష ప్రారంభమైన గంటన్నరకు ప్రశ్నా పత్రం బయటకు వచ్చిందన్నారు. దీన్ని పరీక్ష పేపర్ లీకైనట్టుగా పరిగణించలేమన్నారు.నంద్యాల జిల్లా అంకిరెడ్డిపల్లి ప్రభుత్వ స్కూల్ నుండి పేపర్ బయటకు వచ్చిందని గుర్తించామని విద్యాశాఖ కమిషనర్ వివరించారు. క్వశ్చన్ పేపర్ లను వైరల్ చేసిన వారిని అరెస్ట్ చేసినట్టుగా విద్యాశాఖ కమిషనర్ వివరించారు.