ఏపీ ఎంసెట్ 2019 ఫలితాలు విడుదల, ర్యాంకర్లు వీరే

Siva Kodati |  
Published : Jun 04, 2019, 11:41 AM ISTUpdated : Jun 04, 2019, 01:58 PM IST
ఏపీ ఎంసెట్ 2019 ఫలితాలు విడుదల, ర్యాంకర్లు వీరే

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ కాలేజీలలో ఇంజనీరింగ్, మెడికల్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్-2019 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ కాలేజీలలో ఇంజనీరింగ్, మెడికల్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్-2019 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ఎంసెట్ ఫలితాలను ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విడుదల చేశారు.

ఈ ఏడాది ఎంసెట్‌ను జేఎన్టీయూ కాకినాడ నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 2,82,711 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్‌ ఇంజనీరింగ్‌‌కు 1,85,711 మంది హాజరవ్వగా.. 1,35,160 మంది ఉత్తీర్ణత సాధించారు.

వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షకు 81,916 మంది విద్యార్ధులు హాజరు కాగా 68,512 మంది ఉత్తీర్ణత అయినట్లు అధికారులు వెల్లడించారు.ఇంజనీరింగ్‌లో 74.39 శాతం ఉత్తీర్ణత సాధించగా, అగ్రికల్చర్‌లో 83.64 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.

ఫలితాలను వారి ఈమెయిల్, మొబైల్‌ ఫోన్లకు మెసేజ్ రూపంలో పంపుతామని సెక్రటరీ తెలిపారు.  ఈ నెల 10 నుంచి విద్యార్ధులు ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. మరోవైపు ఏపీ ఎంసెట్‌కు 36,698 మంది విద్యార్ధులు హాజరయ్యారు. 

ఇంజనీరింగ్‌లో టాప్ టెన్ ర్యాంకర్లు:

1. పినిశెట్టి రవిశ్రీ తేజ
2. పి. వేద ప్రణవ్
3. భానుదత్త
4. డి.చంద్రశేఖర్
5. బట్టెపాటి కార్తికేయ
6. రిషి
7. జి. వెంకట కృష్ణ
8. అభిజిత్ రెడ్డి
9. ఆర్యన్ లద్దా
10. హేమ వెంకట అభినవ్

మెడికల్‌లో టాప్‌ టెన్ ర్యాంకులు:

1. సాయిస్వాతి
2. దాసరి కిరణ్ కుమార్ రెడ్డి
3. సాయి ప్రవీణ్ గుప్తా
4. హాషిత
5. మాధురి రెడ్డి
6. కృష్ణ వంశీ
7. కంచి జయశ్రీ వైష్ణవి వర్మ
8. సుభిక్ష
9. హరిప్రసాద్
10. ఎంపటి కుశ్వంత్
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : మీరు ఈ వీకెండ్ కూరగాయల మార్కెట్ కు వెళుతున్నారా..? అయితే ధరలెలా ఉన్నాయో తెలుసుకొండి
CM Chandrababu Naidu: వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు| Asianet News Telugu