బాబుగారి దుబారా ఖర్చులు చూశారా: విజయసాయి ట్వీట్

Siva Kodati |  
Published : Jun 04, 2019, 11:20 AM ISTUpdated : Jun 04, 2019, 11:26 AM IST
బాబుగారి దుబారా ఖర్చులు చూశారా: విజయసాయి ట్వీట్

సారాంశం

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్వీట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. ఆఫీసుల అద్దె చెల్లింపుల్లో టీడీపీ ప్రభుత్వం వందల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సోమవారం వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.

ఆఫీసుల అద్దె చెల్లింపుల్లో చంద్రబాబు ప్రభుత్వం వందల కోట్ల అవినీతికి పాల్పడింది. నక్కల రోడ్డులోని పంచాయతీ రాజ్. గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసుకు ఐదు లక్షల లోపే అద్దె చెల్లించేవారు. దాన్ని రూ.30 లక్షల అద్దె బిల్డింగులోకి షిఫ్ట్ చేశారు. ప్రజల సొమ్ము అంటే ఇంత చులకనా బాబూ?

రాష్ట్రాన్ని విడగొట్టి కట్టుబట్టలతో తరిమారని ఏడ్చి  పెడబొబ్బలు పెట్టిన వ్యక్తి దుబారా ఖర్చులు చూడండి. ఉన్నత విద్యామండలిలో నలుగురి డ్రైఫూట్స్ ఖర్చు18 లక్షలంట. విజనరీ, అనువజ్ణుడు, అభివృద్ధి పదగామి అని కుల మీడియా కీర్తించింది ఈయననే.

ఆశా సిస్టర్ల వేతనాన్ని రూ.3 వేల నుంచి ఒకే సారి 10 వేలకు పెంచి  వైఎస్ జగన్ గారు 50 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు. అక్రిడేటేడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్టు(ఆశా) సోదరీమణులపై చంద్రబాబు ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించింది. అరెస్టులు చేసి హింసలు పెట్టారంటూ విజయసాయి ట్వీట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Chandrababu, Lokesh కి వెంకన్న ప్రసాదం ఇచ్చిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ | Asianet News Telugu
నారావారిపల్లెలో CM Chandrababu Family గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు | Asianet News Telugu