AP DSC 2025: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగల ఎదురుచూపులు ఫలిచాయి. ఎట్టకేలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 19వ తేదీ అర్థరాత్రి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ ప్రకటించింది.
డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. జిల్లా వారీగా పోస్టులకు, కేటగిరీలకు సంబంధించి పోస్టుల వివరాలను తెలిపారు. ఇక అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జూన్ 6 నుంచి జులై 6వ తేదీ వరకు కంప్యూటర్ విధానంలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం, జీవో వివరాలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, సిలబస్, పరీక్ష షెడ్యూల్, నోటిఫికేషన్ తదితర వివరాలు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ నందు అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. అన్ని పరీక్షలు నిర్వహించన తర్వాత తుది కీ విడుదల, అభ్యంతరాలు స్వీకరణ వంటి ప్రక్రియ చేపట్టనున్నారు. జులై నెలాఖరులోగా ఫైనల్ మెరిట్ జాబితా విడుదల చేసి ఉద్యోగాలు ఇవ్వనున్నారు.
జిల్లాల వారీగా పోస్టుల వివరాలు ఇలా..
డీఎస్సీ నోటిఫకేషన్ మొత్తం పోస్టులు 16,347 కాగా.. అందులో జిల్లాల స్థాయిలో స్కూల్ అసిస్టెంట్లు 7487, ఎస్‌జీటీలు 6599, పీఈటీ 2 పోస్టులను ప్రకటించారు. వీటితోపాటు ఆదర్శపాఠశాలలు, గురుకులాలు, ఇతర ప్రత్యేక పాఠశాలలకు సంబంధించి నాలుగు జోనల్‌లో, స్టేట్ లెవల్ కలిపి మొత్తం 2259 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇవి మొత్తం కలిపితే 16,347 పోస్టులను భర్తీ చేయనునాను. ఇక జిల్లాల వారీగా శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 458 ఉండగా.. అందులో ఎస్‌జీటీ 113, స్కూల్ అసిస్టెంట్లు 345 పోస్టులు ఉన్నాయి. విజయనగరం జిల్లాలో మొత్తం 446 ఉండగా.. ఎస్‌జీటీ 210, ఎస్‌ఏ 236 ఖాళీలను భర్తీ చేయనున్నారు. విశాఖపట్నంలో మొత్తం 734 ఉండగా.. ఎస్‌జీటీ 239, ఎస్ఏ 495 పోస్టులు, తూర్పు గోదావరిలో మొత్తం 1241, ఎస్‌జీటీ 423, ఎస్‌ఏ 818, పశ్చిమ గోదావరిలో మొత్తం 1035, ఎస్‌జీటీ 420, ఎస్‌ఏ 615, కృష్ణా జిల్లాలో మొత్తం 1208, ఎస్‌జీటీ 543, ఎస్‌ఏ 665, గుంటూరు జిల్లాలో మొత్తం 1143, ఎస్‌జీటీ 521, ఎస్‌ఏ 622, ప్రకాశం జిల్లాలో మొత్తం 629, ఎస్‌జీటీ 106, ఎస్‌ఏ 523, నెల్లూరు జిల్లాలో మొత్తం 668, ఎస్‌జీటీ 115, ఎస్‌ఏ 553, చిత్తూరు జిల్లాలో మొత్తం 1473, ఎస్‌జీటీ 976, ఎస్‌ఏ 497, కర్నూల్ లో మొత్తం 2645, ఎస్‌జీటీ 1817, ఎస్‌ఏ 828, వైఎస్‌ఆర్ కడప మొత్తం 705, ఎస్‌జీటీ 298, ఎస్‌ఏ 407, అనంతపురం జిల్లాలో మొత్తం 807, ఎస్‌జీటీ 202, ఎస్‌ఏ 605 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక గిరిజనలకు సంబంధించి మొత్తం 881 పోస్టులు ఉండగా.. అందులో ఎస్‌జీటీ 601, ఎస్ఏ 280 పోస్టులు ఉన్నాయి. జువైనల్ వెల్‌ఫేర్ పాఠశాలలు ఎస్‌జీటీ 13, పీఈటీ 2 కలిపి మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. ఇక ఆదర్శపాఠశాలలు, గురుకులాల్లో ఇతర వెల్పేర్ పాఠశాలలు స్టేట్, నాలుగు జోన్లు కలిపి మొత్తం 2228 పోస్టులను విడుదల చేశారు. ఇక ఇప్పటికే అభ్యర్థులకు వయోపరిమితి 42 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ప్రత్యేక జీవో కూడా విడుదల చేసింది. సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్బంగా నిరుద్యోగులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పడం విశేషం.